కాలాకు కుమారస్వామి భరోసా

Kumara Swamy government has made arrangements for the release of Kaala.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన ‘కాలా’ చిత్రం ఈనెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దం అయ్యింది. అంతా విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేదు, కాని కర్ణాటకలో మాత్రం కావేరి నదీ జలాల విషయంలో వివాదం రాజుకుంది. అక్కడ సినిమాను విడుదల చేయనిచ్చేది లేదు అంటూ అక్కడ ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు. రజినీకాంత్‌ సినిమాను విడుదల చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే పలు ప్రజా సంఘాల వారు థియేటర్ల యాజమాన్యంకు హెచ్చరించారు. దేశంలో ఇలాంటి పరిస్థితి మంచిది కాదని, సినిమాలపై ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల స్వేచ్చకు భంగం వాటిల్లినట్లే అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా కాలా సినిమాకు భద్రత కల్పించాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

కర్ణాటకలో ఎన్ని థియేటర్ల వద్ద అయితే ‘కాలా’ చిత్రం విడుదల అవుతుందో, అన్ని థియేటర్ల వద్ద ఆ ఏరియాను బట్టి పోలీసులను కేటాయించాలని, ఎక్కడ కూడా అవాంచిత సంఘటనలు జరుగకుండా చూసుకోవాలంటూ కర్ణాటక ప్రభుత్వంను కోర్టు ఆదేశించింది. దాంతో కుమార స్వామి ప్రభుత్వం కాలా సినిమా విడుదలకు ఏర్పాట్లు చేసింది. డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో నిర్మాత స్వయంగా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నాడు. స్థానిక బయ్యర్ల సాయంతో సినిమాను విడుదలకు సిద్దం చేశారు. కుమారస్వామి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో థియేటర్ల వద్ద భారీ బందోబస్తుకు పోలీసు శాఖ ఏర్పాట్లు చేస్తుంది. మొదటి వారం రోజుల పాటు ఈ బందోబస్తు కొనసాగే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.