అల్లు అర్జున్ రికార్డు ని ఇప్పట్లో బ్రేక్ చేయడం చాలా కష్టం ..!

It is very difficult to break Allu Arjun's record now..!
It is very difficult to break Allu Arjun's record now..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చివరిసారిగా పుష్ప ది రైజ్ సినిమా లో కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీ కి సంబందించిన సీక్వెల్ పుష్ప 2 ది రూల్ లో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బన్నీ ప్రధాన పాత్రలో, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో మూవీ దేశ వ్యాప్తంగా ఏ రేంజ్ క్రేజ్ ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.

It is very difficult to break Allu Arjun's record now..!
It is very difficult to break Allu Arjun’s record now..!

ఈ మూవీ బుల్లితెర పై క్రియేట్ చేసిన రికార్డు చాలా అరుదైనది. ఈ మూవీ అత్యధికం గా 29.4 టీఆర్పీ రేటింగ్ ని నమోదు చేసుకుంది. ఇది ఆల్ టైమ్ రికార్డు. ఈ మూవీ కి చేరువలో సరిలేరు నీకెవ్వరూ (23.5), బాహుబలి 2 (22.7), శ్రీమంతుడు (22.5), పుష్ప ది రైజ్ (22.5) లు నిలిచాయి. అయితే అల వైకుంఠపురములో క్రియేట్ చేసిన రికార్డు ని కొత్త మూవీ లు ఏవీ కూడా బ్రేక్ చేయలేక పోయాయి. ఈ రికార్డు ఇక ఇలానే మిగిలిపోతుందా, లేక వేరే ఏదైనా మూవీ ఈ రికార్డు ని బ్రేక్ చేస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.