ITC లిమిటెడ్ ఫాబెల్లె ఎక్స్‌క్విసైట్ చాక్లెట్స్ ప్రవేశపెడుతోంది ‘Fabelle La Terre’ ఒక విశిష్టమైన, ఎర్త్స్ పాజిటివ్ చాక్లెట్ వేరియంట్

దేశంలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో చాక్లెట్ రుచులు పంచడంలో ఎంతో మంచిపేరు దక్కించుకున్న ITC లిమిటెడ్‌కు చెందిన ఫాబెల్లె చాక్లెట్స్ ఆవిష్కరిస్తోంది ‘Fabelle La Terre’. ఒక సృజనాత్మకమైన రూపురేఖలతో తయారుచేసిన 100% ఎర్త్ పాజిటివ్ చాక్లెట్. ఈ బ్రాండ్ తమదైన శైలిలో రూపొందించిన ఈ విశిష్టమైన చాక్లెట్ వేరియంట్‌ను దీపావళికి ముందు వర్చువల్ ఈవెంట్ ద్వారా ఆవిష్కరించింది. విశ్వసనీయమైన బ్రాండ్స్ అందించే భద్రత మరియు శుభ్రత కలగలసిన ఉత్పత్తులను ఇష్టపడే వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. Fabelle La Terre ఈ అభిరుచులకు అన్నింటికీ అనుగుణమైనదే కాదు దీని మూలంలో ఒక పర్యావరణ హితమైన ప్రభావాంశం కలగలసి ఉంది. ప్రస్తుత పరిస్థితులను ఒక ప్రత్యేకమైన వివేచనతో పరిశీలించిన నేపథ్యమే Fabelle La Terre ఆవిర్భావానికి మూలకారణంగా నిలిచింది.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రకృతి ప్రజలకు ఎన్నో కొత్త విషయాలు నేర్పించింది. స్వచ్ఛమైన గాలిని పీల్చి, నిర్మలమైన ఆకాశాన్ని అంతా కళ్లారా చూశాం. సహజసిద్ధమైన వాతావరణం అంటే ఎలా ఉంటుందో అందరికీ అనుభవంలోకి వచ్చింది. శుభ్రమైన మరియు పచ్చదనంతో నిండిన ప్రపంచం ప్రాముఖ్యత ఏమిటో అందరికీ అర్ధమైంది. ఇవన్నీ ఆధునిక తరం యువతలో చాలామందికి ఏ మాత్రం పరిచయం లేని అంశాలు. పర్యావరణంలో వస్తున్న మార్పులకు కారణమయ్యే కార్బన్ పదార్ధాల వినియోగాన్ని తగ్గించే మార్గాలు అన్వేషించి, వాటిని అనుసరించడం ద్వారానే భవిష్యత్తు తరాలకు మరింత భరోసా కల్పించే అవకాశం ఉంది. కొత్త ప్రపంచ దృక్పథం ఈ నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తోంది. వ్యక్తులతో సంస్థలు/వ్యవస్థలు ఇందుకోసం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం బలపడింది.

వినియోగదారుల ప్రాధాన్య సరళిలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని మరియు ఒక సానుకూలమైన దృక్పథంతో ఫాబెల్లె సైతం పర్యావరణ హితమైన దిశగా అడుగులు వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఎటువంటి రసాయనాలు లేని పదార్ధాలతో వారిని మెప్పించేందుకు ఎర్త్ పాజిటివ్ చాక్లెట్‌కు రూపమిచ్చింది.

Fabelle La Terre ప్రకృతి నుంచి ప్రేరణ పొంది రూపొందించినది. ఈ భూమిని ప్రలైన్ ఫార్మాట్‌లో సరికొత్తగా చూస్తూ కేవలం రెండు సహజసిద్ధ పదార్ధాలతో తయారుచేసింది. అవి కేరళలోని ఇడుక్కి పర్వతాల నుంచి తెచ్చిన ఇండియన్ కొకొవ మరియు కర్ణాటక నుంచి సేకరించిన తేనె. ఈ చాక్లెట్ 33% తేనెతో నిండిన పూర్తిగా చేతితో తయారుచేసిన 100% ఇండియన్/సింగిల్ ఒరిజిన్ చాక్లెట్.

ఈ చాక్లెట్ కాన్సెప్ట్ సింపుల్‌గా ఉన్నప్పటికీ తయారీలో మాత్రం చాలా విశిష్టతలతో కూడుకున్నది. ఎక్కడా ఎలాంటి రాజీ లేని విధంగా పలు దశల్లో, పలు రుచుల సమ్మేళనంగా ఫాబెల్లె యొక్క మాస్టర్ చాక్లెటైర్స్ దీనిని తీర్చిదిద్దారు. ప్రత్యేకమైన మిశ్రమాలతో సాటి లేని రుచి తీసుకురావడంలో వారి సమర్ధతకు ఎంతో గుర్తింపు ఉంది. ఇండియన్ కొకొవా బీన్ కాస్తంత పుల్లగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఇంకా దానిని రుచి చూశాక ఇంకాస్త వగరుగా, చేదుగానూ కూడా అనిపిస్తుంది. అందుకే దీనిని కర్ణాటక తేనెతో ఎంతో జాగ్రత్తగా సమ్మిళితం చేస్తారు. కర్ణాటక తేనె పసందుగా మరియు సుగంధభరితమైన రుచికి పేరొందింది. ఈ రెండింటి కలయిక రుచిని పరిపూర్ణం చేయడంతో  రెండు సహజసిద్ధ గుణాలను సజీవంగా  ఉంచుతుంది.

Fabelle La Terre ప్రలైన్ చూసేందుకు భూమికి సంబంధించిన స్వభావంతో కనిపిస్తుంది. పై భాగం 100% డార్క్ చాక్లెట్. ఇది భూ ఉపరితలాన్ని ప్రతిబింబిస్తుంది.  దానిలో ద్రవరూపంలో కలిసి ఉండే కొకొవ మరియు తేనెల కలయిక, ఈ గ్రహంపై సమృద్ధిగా ఉండే జలరాశికి ప్రతిబింబం. ఈ భూమి ఉపరితలంపై 3/4 వంతు జలమే నిండి ఉంది. ఇక తేనెకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. అది అతి తక్కువ ఉష్ణోగ్రతలోనూ గడ్డ కట్టకుండా ద్రవరూపంలోనే ఉంటుంది. ఒకవేళ రిఫ్రిజిరేటర్‌లో ఉన్నా కూడా అంతే. అన్ని పరిస్థితుల్లో జీవం మనుగడ కొనసాగుతుందనే భావనకు ఈ పదార్ధం ఈ ప్రతీకగాన నిలుస్తుంది.

ఉత్పత్తి తయారీకి అవసరమైన వివిధ దశల్లో కార్బన్ అవశేషాలను తగ్గించేందుకు ఫాబెల్లె గణనీయమైన కృషి చేసింది. కేవలం స్థానిక వనరులు వినియోగించుకోవడం ద్వారా మాత్రమే కాదు, తయారీ & రవాణా వ్యవహారాల్లోనూ కార్బన్ ఉద్గారాలు తగ్గించేవిధంగా ఏర్పాట్లు చేసింది. వీలైనంత తక్కువ పదార్ధాలను వినియోగించడంపై ప్రధానంగా దృష్టి పెట్టింది.. రవాణా దూరం పరంగా చూసుకుంటే మొత్తం మీద మైళ్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. చాక్లెట్ ప్రాసెసింగ్/ మాన్యుఫాక్చరింగ్‌ పద్ధతులను అతి తక్కువ చేయడం/పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకుంది.. కంపెనీ భారీ ఎత్తున చేపట్టిన అడవుల పెంపకం హరిత శోభను పెంచి కార్బన్ కాలుష్యాన్ని తగ్గిస్తోంది. దీంతోపాటు ప్యాకేజింగ్ మెటీరియల్‌ ఇక్కడి నుంచే సేకరించి వాడింది.

ఈ చాక్లెట్ పర్యావరణానికి ఎంతో మేలు చేసేది మరియు రుచిలో సుసంపన్నమైనది కావడంతో పాటు, ఇది గ్లుటెన్ రహితమైనది, లాక్టోజ్ రహితమైనది, గింజలు లేనిది, ఎలాంటి కృత్రిమ పదార్ధాలు లేనిది. ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్ లేవు మరియు ఇది శాకాహార ప్రొడక్ట్ కూడా.

ఆవిష్కరణను పురస్కరించుకుని అనూజ్ రస్తోగిసీఓఓ, చాక్లెట్కాఫీకన్‌ఫెక్షనరీ అండ్ న్యూ కేటగిరీ డెవలప్‌మెంట్ – ఫుడ్స్ ITC లిమిటెడ్, మాట్లాడుతూ, ‘‘అద్వితీయమైన మరియు ఎంతో ప్రత్యేకమైన చాక్లెట్ అనుభూతులను అందించడం అనేది ఫాబెల్లె యొక్క మూల సిద్ధాంతాల్లో ప్రధాన భాగం. ప్రస్తుత పరిస్థితి మనందరిలో కొత్త వివేచనను మేల్కొలిపింది. మనం మన పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలనే విషయం తెలియజేసింది. ఇది మన ఆలోచన మరియు కార్యాచరణలో సుస్థిరంగా ఉండాలి. ఫాబెల్లె ఎర్త్’ ప్రవేశపెట్టడం మన భూమాతకు చేయూతనిచ్చే ప్రయత్నంలో మా మొదటి అడుగు. మా ఈ ప్రయత్నానికి వినియోగదారుల తోడ్పాటు ఉండాలని మేము కోరుకుంటున్నాం’’ అని చెప్పారు.

ప్రొడక్టుకు సంబంధించి మరిన్ని విషయాలను విశదీకరించే క్రమంలో మహేంద్ర బార్వే, జనరల్ మేనేజర్ (ప్రొడక్ట్ డెవలప్మెంట్)ఫుడ్స్ డివిజన్ITC లిమిటెడ్./ఫాబెల్లె మాస్టర్ చాక్లెటైర్ మాట్లాడుతూ ‘‘ఫాబెల్లె ఎర్త్’’ విశిష్టతల పరంగా ఆకట్టుకునేది ఇది కేవలం 2 పదార్ధాల కలయికతో తయారైంది కావడందీనిలోని మూలకాలు మరియు వీటిని తయారుచేసేవారి నైపుణ్యం. ఈ ఉత్పత్తి ఫాబెల్లె యొక్క సంపూర్తి అనుభవానికి నిజమైన మచ్చుతునక. ఇది భిన్న రుచుల చాక్లెట్ అనుభవాన్ని చవిచూసేలా చేయడంలో విజయవంతమవుతుంది. ఇంకా మొత్తం చాక్లెట్స్ ఇండస్ర్టీకి ఒక సానుకూల మార్గం చూపించే వేదికగా నిలుస్తుంది. ఎర్త్ పాజిటివ్ ద్వారా చాక్లెట్ రూపంలో భూమి కాన్సెప్టును తిరిగి కళ్ల ముందుకు తీసుకొచ్చి మేము మరో ప్రత్యేకమైన అనుభూతిని పంచుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నాం’’ అని చెప్పారు.

 Fabelle La Terre ఆవిష్కరణ పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాల్లో ITC లిమిటెడ్ యొక్క నిబద్ధతను చాటడంలో మరియు వాటిని కొనసాగించడంలో ఒక మైలురాయి. కార్బన్ పాజిటివ్‌లో (15 సంవత్సరాలు వరుసగా), వాటర్ పాజిటివ్‌లో (18 సంవత్సరాలు నిరంతరాయంగా) మరియు సాలిడ్ వేస్ట్ రీ సైక్లింగ్ పాజిటివ్‌లో (గత 13 సంవత్సరాలుగా) ITC ప్రపంచవ్యాప్తంగా ముందుస్థానం సాధించడం ఎంతో గర్వించదగిన విషయం.

10 Fabelle La Terre ప్రాలైన్స్ ఉన్న ఒక పెట్టె రూ. 1500 ధర వద్ద లభిస్తుంది. ముందుగా 6 ప్రధాన మెట్రో నగరాల్లో ఆర్డర్‌ ద్వారా పొందవచ్చు.

ITC Foods గురించి: ITC లిమిటెడ్ యొక్క విభాగం

భారత దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆహార ఆధారిత వ్యాపారం, మూడో అతి పెద్ద ఫుడ్-బేస్డ్ కంపెనీగా ITC Foods బిజినెస్ గుర్తింపు పొందింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్, బింగో!, యప్పీ!, కిచెన్స్ ఆఫ్ ఇండియా, బి నేచురల్, మింట్-ఓ, కేండీమేన్, ఫాబెల్, సన్‌బీన్, మరియు గమ్ఆన్ వంటి ప్రముఖ బ్రాండ్లతో వినియోగ మార్కెట్లో తన పట్టును కంపెనీ నిలబెట్టుకుంటోంది. ఈ రోజుల్లో ఫుడ్స్ వ్యాపారాలను మార్కెట్లో పలు విభాగాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. స్టేపుల్స్, స్పైసెస్, రెడీ-టు-ఈట్, స్నాక్ ఫుడ్స్, బేకరీ & కన్‌ఫెక్షనరీలతో పాటు తాజాగా పరిచయం చేసిన జ్యూస్ & బెవరేజ్‌ల విభాగాలు ఇందులో ఉన్నాయి.

ITCకి చెందిన అంతర్గత ఆర్&డీ సామర్ధ్యంతో అభివృద్ధి చేసిన వైవిధ్యత గల, విలువ ఆధారిత ఉత్పత్తులు కోట్ల కొద్దీ కుటుంబాలకు, ITC Foods బ్రాండ్స్ సేవలు అందిస్తున్నాయి. వినియోగ అవసరాలను లోతుగా అర్ధంగా చేసుకోవడం, భారతీయ వినియోగదారుల రుచి-అభిరుచిలను అర్ధం చేసుకోవడం, వ్యవసాయ-మూలాల నుంచి సేకరించడం, శక్తివంతమైన ప్యాకేజింగ్ మరియు అసమానమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ఇందుకు సహకరిస్తున్నాయి.

అత్యధిక నాణ్యత, భద్రత, పరిశుభ్ర ప్రమాణాలను తయారీ విధానం మరియు సరఫరా చెయిన్‌లలో నిర్వహించడంలో, ఎటువంటి పరిస్థితులలోను రాజీ పడబోమనే నిబద్ధతను ITC సంస్థ కలిగి ఉంది. ITC సొంత తయారీ యూనిట్లు అన్నీ ప్రమాద విశ్లేషణ మరియు సంక్లిష్ట నియంత్రణ కేంద్రం (HACCP) ద్వారా ధృవీకరణను పొందాయి. అన్ని తయారీ యూనిట్స్‌లోను నాణ్యతా ప్రమాణాల కొనసాగింపును, నిరంతరం ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. ప్రాసెస్ కంట్రోల్‌కు అదనంగా, ఆహార ఉత్పత్తుల తయారీకి అవసరమైన మూల పదార్ధాల ఎంపికలోనే, అత్యంత సూక్ష్మత కలిగిన నాణ్యత ప్రమాణాలను కఠినంగా పాటిస్తామని ITC ధృవీకరిస్తుంది.

తయారీ రంగం, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ వంటి అన్ని వ్యాపారాలలోను పెట్టుబడులను, ఈ విభాగం కొనసాగిస్తుంది. తద్వారా దేశంలో బ్రాండెడ్ ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ వ్యాపారంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని అందుకోవడంతో పాటు, ఈ మార్కెట్‌లో ఉన్న మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఉత్తర అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆస్ట్రేలియా వంటి కీలక భౌగోళిక ప్రాంతాలకు, ITC Foods విభాగం తమ ఉత్పత్తులను ఎగుమతులు కూడా చేస్తోంది.