కేరళకు సల్మాన్‌ 12 కోట్ల విరాళం.. నిజం కాదేమో!

Jaaved Jaaferi tweets Salman Khan donated Rs 12 cr for Kerala flood victims, deletes it later

కేరళను వరదలు ముంచెత్తిన కారణంగా దాదాపు 70 శాతం ప్రజలు సర్వం కోల్పోయారు. ప్రస్తుతం కేరళ మెల్ల మెల్లగా కోలుకుంటుంది. ఈసమయంలోనే దాతలు కేరళకు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. సినీ తారలు కేరళకు తమవంతు సాయంగా ఆర్థిక సాయంను ప్రకటిస్తూ ముందుకు వస్తున్నారు. ఎంతో మంది సినీ తారలు ఇప్పటికే భారీ విరాళంను ప్రకటించారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కూడా ఏకంగా 12 కోట్లను విరాళం ఇచ్చినట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గతంలో పలువురు భారీ సాయం చేసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. కాని అవన్ని కేవలం పుకార్లే అంటూ ఆ తర్వాత తేలిపోయింది. ఇప్పుడు సల్మాన్‌ విషయంలో కూడా అదే అవుతుందని కొందరు భావిస్తున్నారు.

Jaaved Jaaferi tweets Salman Khan

సల్మాన్‌ ఖాన్‌ విరాళం విషయాన్ని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు జావెద్‌ చెప్పడంతో ఎక్కువ శాతం మంది ఈ విషయాన్ని నమ్ముతున్నారు. సల్లూ భాయ్‌ భారీ విరాళం ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలని, ఆయన సాయంతో కేరళ కొంతలో కొంత అయినా కోలుకుంటుందని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ విషయమై పలువురు పలు రకాలుగా స్పందించడంతో జావెద్‌ మరో ట్వీట్‌లో స్పందిస్తూ సల్మాన్‌ ఖాన్‌ విరాళం ఇచ్చినట్లుగా తనకు తెలిసిందని చెప్పాను, కాని మీడియాలో మాత్రం సల్మాన్‌ ఖాన్‌ ఇచ్చాడు అంటూ నేను చెప్పాను అంటూ వార్తలు వస్తున్నాయి. సల్మాన్‌ ఇచ్చాడో లేదో తెలిసే వరకు తన ట్వీట్‌ను వెనక్కు తీసుకుంటున్నట్లుగా ఈ సందర్బంగా జావేద్‌ ట్వీట్‌ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సల్మాన్‌ ఖాన్‌ నుండి అధికారికంగా ప్రకట రాలేదు.

Jaaved jaaferi tweet