నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ల భేటీ

నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ల భేటీ

దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ల భేటీ ముగిసింది. దాదాపుగా గంటన్నర పాటు సాగిన వీరి సమావేశంలో పలు కీలకమైన అంశాలను చర్చించారని సమాచారం. కాగా ఇటీవల సీఎం జగన్ కేంద్రానికి రాసినటువంటి లేఖలోని అన్ని అంశాలు కూడా చర్చించారని సమాచారం. ఇకపోతే రానున్న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 25 న ఏపీలో 25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నామని చెప్పి, ఈ వేడుకకు ప్రధాని మోడీని తప్పకుండ హాజరు కావాలని సీఎం జగన్ ప్రత్యేకంగా ఆహ్వానించారని తెలుస్తుంది. అయితే ఈ వేడుకకు హాజరు కావడానికి ప్రధాని మోడీ కూడా సమ్మతం తెలిపారని సమాచారం.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం, రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు, కర్నూలులో హై కోర్టు నిర్మాణం పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు రూ.55, 549 కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులకు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశించారని కూడా వెల్లడించారు. ఇకపోతే రాష్ట్రానికి అవసరమైన, మరియు కేంద్రం నుండి రావాల్సిన నిధులన్నీ కూడా సకాలంలో అందజేయాలని ప్రధాని మోడీ ని సీఎం జగన్ కోరుకున్నట్లు సమాచారం.