నంద్యాలలో వైసీపీ గెలిస్తే జగన్ సీఎం ?

Jagan Becomes CM If He Wins Nandyala

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉపఎన్నికని టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలకి ఇక్కడ గెలుపు ఎంతో అవసరం. అందుకు తగ్గట్టే వ్యూహాలకి పదును పెడుతున్నాయి. ప్రచార పర్వాన్ని మోతెక్కిస్తున్నాయి. అయితే నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా వైసీపీ తన ప్రచార పర్వంలో వినియోగిస్తున్న ఓ పాంప్లేట్ మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది.

నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ ప్రచారం కోసం తయారు చేసిన సదరు పాంప్లేట్ లో అన్న వస్తున్నాడు, నవరత్నాలు తెస్తున్నాడు అంటూ ప్రారంభించి జగన్ సీఎం అయితే అమలు చేసే పధకాల గురించి వివరించారు. అయినా నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ గెలిచినా జగన్ సీఎం కాలేడు కదా. ఆ విషయం మర్చిపోయి ఇప్పుడే 2019 ఎన్నికల ప్రచారం మొదలెట్టిన వైసీపీ ని చూసి నంద్యాల ఓటర్లు ఆశ్చర్యపోతున్నారు. పైగా ఇలాంటి విషయాలు వల్ల జగన్ కి సీఎం కావాలన్న యావ ఎక్కువన్న ప్రచారం నిజమని నమ్మక తప్పేట్టు లేదు.