డ్రగ్స్ కేసుకు సీక్రెట్ మీటింగ్ కు లింకేంటి..?

Secret Meeting Links Drugs Case

Secret Meeting Links Drugs Case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మియాపూర్ ల్యాండ్ స్కామ్ పెద్దదవుతున్న తరుణంలో అందివచ్చిన డ్రగ్స్ కేసును కేసీఆర్ రెండుచేతులా అందిపుచ్చుకున్నారు. పన్నెండు మంది సినీ ప్రముఖులకు తాఖీదులు పంపి సంచలనం సృష్టించారు. అకున్ సభర్వాల్ ను ముందుపెట్టి కథ నడిపిస్తున్నారు. కానీ అంతలోనే ఉన్నట్లుండి డౌన్ అయ్యారు కేసీఆర్. డ్రగ్స్ తీసుకున్న వాళ్లంతా బాధితులేనని చిలక పలుకులు పలికారు.

కానీ కేసీఆర్ సడెన్ గా ప్లేటు ఫిరాయించడానికి టాలీవుడ్ పెద్దల సీక్రెట్ మీటింగ్ కారణమని తెలుస్తోంది. డ్రగ్స్ కేసు విచారణతో సినీ పరిశ్రమ ఉక్కిరిబిక్కిరైంది. డ్రగ్స్ సాకుతో తమను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని టాలీవుడ్ వాపోయింది. దీంతో వెంటనే పెద్దలంతా సీక్రెట్ మీటింగ్ పెట్టారు. అవసరమైతే హైదరాబాద్ వదలి విశాఖ వెళ్లిపోవాలని డిసైడయ్యారు.

అటు ఏపీ మంత్రి గంటా, మరో మంత్రి లోకేష్ కూడా టాలీవుడ్ ను ఆహ్వానించారు. దీంతో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. సినీ పరిశ్రమ హైదరాబాద్ లో విడదీయలేని భాగంగా ఉందని, ఇప్పుడు అది తరలి వెళ్లిపోతే బ్రాండ్ హైదరాబాద్ కు దెబ్బ పడుతుందని కేసీఆర్ బెదిరిపోయారు. అందుకే డ్రగ్స్ కేసును నిదానంగా నీరుగార్చాలని మౌఖిక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రెస్ మీట్లో కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.