జగన్ సీఎం….కేసీఆర్, కేటీఆర్ ఏమన్నారంటే ?

Jagan CM .... what KCR and KTR said

అయితే ఏపీ ప్రజలు అఖండ మెజారిటీతో వైసీపీకి ఘనవిజయం కట్టబెట్టడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఏపీలో బ్రహ్మాండమైన విజయం సాధించిన జగన్ కు ఆయన అభినందనలు తెలిపారు. ఇకపై రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షను వ్యక్తం చేశారు. అటు, లోక్ సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ప్రధాని నరేంద్ర మోదీకి కూడా కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత పురోగతి సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇదే విషయం మీద టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఏపీలో అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. “వెల్లువలాంటి ప్రజల దీవెనలతో మీ కష్టం ఫలించింది జగన్ గారూ. మా తోబుట్టువు లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రమంలో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను” అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.