అది హిట్ కొడితే ఆటో జానీ కూడా లైన్లోకి వచ్చినట్టే ?

Puri Jagannadh Is The Main Reason For Drug Case

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ టైంలో పూరి జగన్నాథ్ చిరు కోసం ఆటో జానీ సినిమా కథ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అయితే ఈ సినిమానే చిరు రీ ఎంట్రీ మూవీ అవుతుందని పుకార్లు షికారు చేసాయి. అయితే అప్పటికి పూరీ ఫాంలో లేకపోవడం చిరు రిస్క్ చేసే పరిస్థితిలో లేకపోవడంతో చిరంజీవి ఆ సినిమా పక్కన పెట్టేసి ఖైది నంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే చరణ్ మాత్రం ఈ కధ విన్నప్పటి నుండి ఆ సబ్జెక్ట్ మీద మనసు పడ్డాడట. ప్రస్తుతం రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాథ్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చాటాలని చూస్తున్నాడు .ఇందులో రామ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. స్మార్ట్ శంకర్ తో పూరి హిట్టు కొడితే ఆటోజానీ సినిమాని ఓకే చెయ్యాలనే ఆలోచనతో రాం చరణ్ ఉన్నాడు అని తెలుస్తుంది. అది కూడా చిరు హీరోగా కాదు తనే హీరోగా ఆటోజానీ అవ్వాలని ఆలోచిస్తున్నాడట. ప్రస్తుతం మాస్ సినిమాలకు కమర్షియల్ గా ఎక్కువ వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చరణ్ ఆటో జానీ మీద కన్నేశాడని తెలుస్తుంది. ప్రస్తుతం రాం చరణ్ రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో తారక్ తో పాటుగా చరణ్ కూడా నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత చరణ్ పూరితోనే సినిమా ఫిక్స్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.