జ‌గ‌ప‌తిబాబు తో జత కట్టిన అమల పాల్

జ‌గ‌ప‌తిబాబు తో జత కట్టిన అమల పాల్

డిజిట‌ల్ మీడియాకు ఆద‌ర‌ణ పెరుగుతూ వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో కొత్త కొత్త కాన్సెప్ట్‌ల‌తో ప‌లు వెబ్‌సిరీస్‌లు రూపొందుతున్నాయి. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌ను పొందుతున్నాయి. అలా ఆద‌ర‌ణను పొందిన వెబ్‌సిరీస్‌లో ల‌స్ట్ సోరీస్ ఒక‌టి. నాలుగు జంట‌ల ప్ర‌యాణానికి సంబంధించిన క‌థ. అలాంటి కథల సంపుటితో తెలుగులోనూ ఓ వెబ్ సిరీస్ రానుంది.

ఈ వెబ్ సిరీస్‌ను రోని స్క్రూవాలా నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ఓ భాగంలో అమ‌లాపాల్‌, జ‌గ‌ప‌తిబాబు క‌లిసి న‌టిస్తున్నారు. ఈభాగాన్ని నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ఇందులో అమ‌లాపాల్ 10 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్నారు. మ‌రి జ‌గ‌ప‌తిబాబు, అమ‌లాపాల్ పాత్ర‌లను ఎలా డిజైన్ చేశారు. ఎలాంటి ఎమోష‌న్స్ ఉంటాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

మ‌రి సందీప్ వంగా, సంక‌ల్ప్‌, త‌రుణ్ భాస్క‌ర్ చేయ‌బోయే మూడు భాగాల్లో ఎవ‌రెవ‌రు న‌టిస్తారనే విష‌యాలు తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే. మ‌రి దీని ఇన్‌స్పిరేష‌న్‌తో ఫ్యూచ‌ర్‌లో ఎలాంటి వెబ్‌సిరీస్‌లు రానున్నాయో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.