ఎన్టీఆర్ సినిమా పేరు శ్రీనివాస క‌ళ్యాణం?

Jr NTR Dil Raja combination Next Movie In Srinivasa Kalyanam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్‌, దిల్ రాజు కాంబినేష‌న్ లో మ‌రో సినిమా వ‌చ్చే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా షూటింగ్ లోనూ, బిగ్ బాస్ లోనూ బిజీగా ఉన్నారు. జై ల‌వ‌కుశ ద‌స‌రా కానుక‌గా ఈ నెల 21 న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత తార‌క్ తొలిసారి త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్ లో న‌టించ‌నున్నారు. త్రివిక్ర‌మ్ మూవీ కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ దిల్ రాజు చిత్రంలో న‌టిస్తార‌ని ఫిలింన‌గ‌ర్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది. కుటుంబ విలువ‌లు, భావోద్వేగాల నేప‌థ్యంలో తెర‌కెక్కనున్న ఈ సినిమాకు శ్రీనివాస క‌ళ్యాణం అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం దిల్ రాజు ఎన్టీఆర్ కు భారీ పారితోష‌కం ఆఫ‌ర్ చేసిన‌ట్టు టాలీవుడ్ లో టాక్ న‌డుస్తోంది. గ‌తంలో వారిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన బృందావ‌నం భారీ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ కు ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఇచ్చి కుటుంబ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర చేసింది. మ‌ళ్లీ అలాంటి మ్యాజిక్ రిపీట్ చేయాల‌ని దిల్ రాజు భావిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టుల వివరాలు ఇంకా వెల్ల‌డి కాలేదు.

మరిన్ని వార్తలు:

తెలుగుదేశం కంచుకోటలు ఎన్నో తెలుసా?

రెండు సీట్లపై కన్నేసిన పరిటాల ఫ్యామిలీ