ఇందుకే ఎన్టీఆర్‌ ‘బిగ్‌బాస్‌’ను చూస్తున్నారు

jr-ntr-interesting-performance-in-bigg-boss-telugu-show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బుల్లి తెరపై మొదటిసారి అయినా కూడా ‘బిగ్‌బాస్‌’ షోతో ఎన్టీఆర్‌ అభిమానులతో పాటు ప్రేక్షకులను కట్టి పడేస్తున్నాడు. వారంలో శని, ఆది వారాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఎన్టీఆర్‌ ఆ రెండు రోజుల్లో ‘బిగ్‌బాస్‌’ రేటింగ్‌ను అమాంతం పెంచేస్తున్నాడు. వారంలో మిగిలిన అయిదు రోజులు చూడకున్నా ఎన్టీఆర్‌ వచ్చే ఆ రెండు రోజులు మాత్రం బిగ్‌బాస్‌ను ప్రేక్షకులు వదలకుండా చూస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ ఇంటి సభ్యులతో ఆడుతున్న ఆటలు, వారితో మాట్లాడుతున్న మాటలు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఇక నవదీప్‌తో చేసిన కామెడీ షోకే హైలైట్‌గా నిలిచింది.

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ నవదీప్‌ మీ ఇంట్లో పాత 500, 1000 రూపాయల నోట్లు లభ్యం అయ్యాయి. మీరు విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. అయిదు నిమిషాల్లో మీరు మీ బ్యాగ్‌ను సర్దేసుకుని వెళ్లి పోవాలి అంటూ ఆదేశించాడు. అందుకు వెంటనే నవదీప్‌ బ్యాగ్‌ను సర్దేసుకుని బయలుజేరేందుకు సిద్దం అయ్యాడు. అంత వరకు సీరియస్‌గా ఉన్న ఎన్టీఆర్‌ ఒక్కసారిగా నవ్వేసి.. ఇంటి సభ్యులతో కొత్త వెయ్యి నోట్లు వచ్చాయి అని నీకే చెప్పవచ్చా, మాకు తెలియదా నీతో ఆడుకోవడం అన్నాడు. దాంతో ఇంటి సభ్యులు అంతా కూడా ఒక్కసారిగా కూల్‌ అవ్వడంతో పాటు నవ్వేసుకున్నారు. నవదీప్‌ కూడా రిలాక్స్‌ అయ్యాడు. ఇలాంటి చిన్న చిన్న గేమ్స్‌ ఆడుతూ ఎన్టీఆర్‌ షోపై రోజు రోజుకు ఆసక్తి పెరిగేలా చేస్తున్నాడు.

ఉయ్యాలవాడ మరో బాహుబలి!!

ఇలియానాను ఇబ్బంది పెట్టిన ఫ్యాన్‌

అర్జున్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ లీడర్‌ సీరియస్‌