అర్జున్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ లీడర్‌ సీరియస్‌

VH-Was-Angry-With-The-Film-

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విజయ్‌ దేవరకొండ హీరోగా షాలిని హీరోయిన్‌గా సందీప్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్‌ రెడ్డి’ ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా టీజర్‌ ఆరు నెలల క్రితం విడుదలైంది. ఆ టీజర్‌లో హీరో, హీరోయిన్‌ మద్య లిప్‌లాక్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండబోతుందని ట్రైలర్‌ చూస్తే తేలిపోయింది. అయితే లిప్‌లాక్‌ సీన్‌కు మంచి క్రేజ్‌ వచ్చిన నేపథ్యంలో సినిమాను ఆ లిప్‌లాక్‌తోనే ప్రమోట్‌ చేయాలని, యూత్‌ ఆడియన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతో భారీగా లిప్‌లాక్‌ పోస్టర్స్‌ను హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వేయడం జరిగింది.

బస్సులపై ఇంకా పెద్ద పెద్ద హోర్డింగ్‌లో లిప్‌లాక్‌ను వేయడంతో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావు ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బస్సుపై ఉన్న పోస్టర్స్‌ను చింపేశాడు. ఇలాంటి పోస్టర్లతో యువతను పెడద్రోవ పట్టించడం అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇలాంటి వాటిని ఉపేక్షించవద్దని వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సినిమా విడుదలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించాడు. ముద్దు పెట్టుకునే పోస్టర్‌లను వెంటనే తొలగించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదర్కోవాల్సి ఉంటుందని విహెచ్‌ హెచ్చరించాడు.

మ‌హాన‌టిలో ప్ర‌కాశ్ రాజ్ ఎవ‌రు?

కక్ష సాధిస్తున్నారని నిహ్లానీ ఆక్రోశం

హీరోల‌ను మించిన‌ ఫ్యాన్ ఫాలోయింగ్