రణ్‌బీర్‌తో రష్మిక లిప్‌లాక్.. ‘యానిమల్’ పోస్టర్ వైరల్

రణ్‌బీర్‌తో రష్మిక లిప్‌లాక్.. ‘యానిమల్’ పోస్టర్ వైరల్
Movie News

అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ చిత్రా లతో సూపర్ స్టార్​డమ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలతో ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్​ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ని దక్కించుకున్నాడు. రణ్​బీర్ ప్రధాన పాత్రలో.. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం “యానిమల్” .

రణ్‌బీర్‌తో రష్మిక లిప్‌లాక్.. ‘యానిమల్’ పోస్టర్ వైరల్
Ranbeer , Rashmika

అయితే.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న యానిమల్ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. రణ్ బీర్, రష్మిక మినీ ప్లేన్ ను నడుపుతూ లిప్ లాక్ చేస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ అర్జున్ రెడ్డి మూవీ ని గుర్తు చేస్తోందంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా లోని ‘అమ్మాయి’ సాంగ్ ను రేపు విడుదల చేయనున్నారు.