అక్టోబర్ 15 నుండి విశాఖ శారదాపీఠంలో దసరా ఉత్సవాలు ప్రారంభం

అక్టోబర్ 15 నుండి విశాఖ శారదాపీఠంలో దసరా ఉత్సవాలు ప్రారంభం
Durga devi

శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 15న ప్రారంభం కానున్నాయి.

రోజువారీ అవతారంలో రాజశ్యామల దేవి దర్శనం:

మొదటి రోజు: బాలాత్రిపుర సుందరి
రెండవ రోజు: మహేశ్వరి
మూడో రోజు: వైష్ణవి
నాల్గవ రోజు: అన్నపూర్ణ
ఐదవ రోజు: లలితా త్రిపుర సుందరి
ఆరవ రోజు: సరస్వతీ దేవి
ఏడవ రోజు: మహాలక్ష్మి
ఎనిమిదవ రోజు: మహాకాళి
తొమ్మిదవ రోజు: మహిషాసుర మర్ధిని
విజయదశమి: విజయ దుర్గ

విజయదశమి నాడు శమీ చెట్టు దగ్గర ఆయుధపూజ చేస్తారు.

శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం:

శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం శ్రీ శారద స్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరులకు పీఠార్చన, అనంతరం సాంస్కృతిక ఆరాధన కూడా ఉంటుంది. మహిళలు రోజూ కుంకుమార్చన చేస్తారు.

అక్టోబర్ 20న సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి విశాఖ శ్రీ శారదా పీఠంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 24న జరిగే విజయదశమి వేడుకలతో ఉత్సవాలు ముగుస్తాయి.