హీరోల‌ను మించిన‌ ఫ్యాన్ ఫాలోయింగ్

Sunny Leone in Kochi

 

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించి..అనంత‌రం బాలీవుడ్ బాట‌ప‌ట్టి పాత జీవితానికి గుడ్ బై చెప్పిన స‌న్నీలియోన్ ఎప్పుడూ వార్త‌ల్లో వ్య‌క్తే..ఆమెకు సంబంధించి ఏదో ఒక విశేషం రోజూ సినిమా పేజీలో క‌నిపిస్తూనే ఉంటుంది. తొలుత మ‌హేష్ బాబు సినిమాలో న‌టించ‌టానికి ఇండియా వ‌చ్చిన‌ప్పుడు  ఆమెకు ఇక్క‌డ ఎన్నో చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. బాలీవుడ్ కు వ‌చ్చిన కొత్త‌ల్లో ఆమెకు ముంబ‌యిలో ఇల్లు అద్దెకు ఇవ్వ‌టానికి ఎవ్వ‌రూ ముందుకు రాలేదు. ఎలాగోలా క‌ష్ట‌ప‌డి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బాలీవుడ్ లో చిత్రాలు చేయ‌టం ప్రారంభించారు స‌న్నీలియోన్‌. నెమ్మ‌ది నెమ్మ‌దిగా ఆమెకు అవ‌కాశాలు పెరిగాయి. ఉత్త‌రాదికే ప‌రిమితం కాకుండా ద‌క్షిణాది చిత్రాల్లోనూ న‌టించ‌టం ప్రారంభించారు. ఆ క్ర‌మంలోనే తెలుగులో కరెంటు తీగ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేశారు.

Image result for Sunny Kochi went to launch a mobile showroom

బాలీవుడ్ లో వ‌రుస‌గా అవ‌కాశాలు అందిపుచ్చుకుంటున్నారు. సాధార‌ణ బాలీవుడ్ హీరోయిన్ లానే ఆమె సినిమాల్లో న‌టిస్తున్నారు. కానీ అప్పుడ‌ప్పుడూ ఆమెకు కొందరు పాత జీవితం గుర్తుచేస్తూ అవ‌మానాలు చేస్తుంటారు. రెండేళ్ల క్రితం ఓ జ‌ర్న‌లిస్టు ఆమెను ఇంట‌ర్వ్యూ చేస్తూ ఎవ‌రితో న‌టించాల‌ని ఉంద‌ని ఆమెను అడిగిన‌ప్పుడు అమీర్ ఖాన్ తో అని స‌న్నీ లియోన్ బ‌దులిచ్చారు. దానిపై ఆ జ‌ర్న‌లిస్టు స్పందిస్తూ  మీలాంటి వాళ్ల‌తో అమీర్ ఖాన్ ఎలా న‌టిస్తారు…అతిగా ఆశ‌ప‌డ‌కూడ‌దు అంటూ చేసిన వ్యాఖ్య‌లు బాలీవుడ్ లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఆ ఇంట‌ర్వ్యూ త‌ర్వాత అమీర్ ఖాన్ జ‌ర్న‌లిస్టు వ్యాఖ్య‌ల‌ను ఖండించి  అవ‌కాశం వ‌స్తే స‌న్నీలియోన్ తో క‌లిసి ప‌నిచేస్తాన‌ని ట్వీట్ చేశారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత బ‌హిరంగంగా స‌న్నీకి దేశంలో ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదు.  ప‌డ్డ చోటే నిల‌దొక్కుకుంటున్న‌ట్టుగా ఆమె ప్ర‌యాణం సాగుతోంది. ఆమెకు అద్దెకు ఇల్లివ్వ‌టానికి నిరాక‌రించిన ముంబైలోనే ఇటీవ‌ల భారీ బంగ్లా కొనుక్కున్నారు.

Image result for Sunny Kochi went to launch a mobile showroom

 ఒక అనాథ పాప‌ను ద‌త్త‌త తీసుకుని త‌న స‌హృద‌యాన్ని చాటుకున్నారు. అంతేకాదు  ఆమెకు ప్రేక్ష‌కాద‌ర‌ణ కూడా ఊహించ‌ని రీతిలో పెరిగింది. బాలీవుడ్ హీరోయిన్ల‌నే కాదు..హీరోల‌నే మించిపోయేంతంగా ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంద‌న‌టానికి కొచ్చిలో ఆమెను చూడ‌టానికి అపంఖ్యాకంగా త‌ర‌లివ‌చ్చిన ప్ర‌జ‌లే ఉదాహ‌ర‌ణ . రెండు రోజుల క్రితం ఓ మొబైల్ షోరూం ప్రారంభించ‌టానికి స‌న్నీ కొచ్చి వెళ్లారు. అక్క‌డ ఆమెను చూసేందుకు  వ‌చ్చిన అభిమాన‌ల‌తో ట్రాఫిక్ కు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. అభిమానుల్ని అదుపుచేయ‌టానికి చాలా మంది పోలీసులు రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది. ఈ అభిమాన గ‌ణాన్ని చూసిన స‌న్నీకి నోట‌మాట రాలేదు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆమె త‌న ఆనందాన్ని పంచుకున్నారు. కేర‌ళ ప్ర‌జ‌ల్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేన‌ని ట్వీట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. కేర‌ళ ప్ర‌జ‌ల అసాధార‌ణ‌మైన నిజాయితీకి సెల్యూట్ చేస్తున్నాన‌ని వ‌ర్మ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. స‌న్నీలియోన్ ను చూసి కేర‌ళ సూప‌ర్  స్టార్లు మ‌మ్ముట్టి, మోహ‌న్ లాల్ లు అసూయ‌తో ఏడుస్తార‌ని, వారి కోసం ఇంత‌మంది జ‌నం ఎప్పుడూ రాలేద‌ని వ‌ర్మ కామెంట్ చేశారు. మొత్తానికి  స‌న్నీలియోన్ పోర్న్ స్టార్ అన్న ఇమేజ్ ను ప‌క్క‌న పెట్టి మ‌రీ మ‌న‌దేశంలో పెద్ద సంఖ్య‌లో అభిమానుల్ని సంపాదించుకున్నారు.

మరిన్ని వార్తలు:

దిగజారాల్సిన అవసరం నాకు లేదు

రాజమౌళి చేతుల మీదుగా మెగా151?

స్పైడ‌ర్ సాంగ్ రాసిన త‌మిళ ర‌చ‌యిత‌