టీడీపీని కాపీ కొడుతున్న వైసీపీ

ys-jagan-copying-chandrababu-naidu-for-kapu-caste-people

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జగన్ మొదట్నుంచి తనవైన సొంత వ్యూహాలను అమలు చేయడంలో విఫలమౌతున్నారు. మొదట్లో తండ్రిని కాపీ కొట్టిన జగన్.. ఇప్పుడు బాబును కాపీ కొడుతున్నారు. ఎవరో ఒకర్ని కాపీ కొడితే సీఎం కాలేరని, సొంత వ్యూహాలు ఉండాలని సీనియర్లు మొత్తుకుంటున్నా ఆయన వినిపించుకోవడం లేదట. ఎవరూ అడక్కపోయినా కాపుల గురించి తానే మాట్లాడానన్న చంద్రబాబు మాటలతో ఇన్ స్పైర్ అయిన జగన్ తాను కూడా కాపులకు పెద్ద పీట వేస్తున్నారు.

గతంలో విశాఖలో బోర్లా పడ్డ జగన్.. ఈసారి సత్తా చాటాలని డిసైడయ్యారు. అందుకే విశాఖ పార్టీలో కాపులకు పెద్దపీట వేస్తున్నారు. కానీ చంద్రబాబు చర్యలతో మెజార్టీ కాపులు టీడీపీ వైపే ఉన్నారు. ఇలాంటి సమయంలో పార్టీకి అండగా ఉన్న సామాజిక వర్గాల్ని చేరదీయాలని నేతలు చెప్పినా జగన్ వినడం లేదట. దీంతో ప్రశాంత్ కిషోర్ కూడా ఏం చేయలేక సైలంటైపోయారట.

కాపు కులం కోసం చూసుకుంటే.. గవర, మత్స్యకార, యాదవ, వెలమ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కొరివితో తలగోక్కోవడమేనని అందరూ భావిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఎలాగైనా అన్నికులాలను సంతృప్తి పరిచే అవకాశాలు ఉంటాయని, కానీ వైసీపీ ప్రతిపక్షంలో ఉందన్న సంగతి జగన్ మర్చిపోతున్నారని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

ఇవేం మాటలు తొగాడియా

సోమ‌వారం పోల‌వారం, శుక్ర‌వారం, జైలువారం

ఆ విలాసాల‌కు అల‌వాటు ప‌డొద్దు