హరిబాబును రోడ్డు మీద వదిలెయ్యరులే

ts-bjp-leaders-troubling-haribabu-in-getting-mister-post-in-centar

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏపీ, తెలంగాణలో రాజకీయ పార్టీల వైషమ్యాలు ఎక్కువగానే ఉన్నాయి. రెండు చోట్లా యాక్టివ్ గా ఉన్న పార్టీల్లో కూడా రెండు యూనిట్లకూ పడదు. అంతెందుకు తెలంగాణ టీడీపీ నేతలు ఏపీ టీడీపీ నేతల్ని చూసి కుళ్లుకుంటూ ఉంటారు. ఇక ఏపీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిండా ముంచారని అనుకుంటారు. కానీ రెండు చోట్లా పెద్దగా బలం లేని బీజేపీ యూనిట్ల మధ్య కూడా పొసగడం లేదని తాజాగా వెలుగులోకి వచ్చింది.

వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లడంతో.. కేంద్రమంత్రిగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబును నియమిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో హరిబాబు కూడా కేంద్రమంత్రి అయిపోయాననే ఆనందంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తెలంగాణ బీజేపీ నేత మురళీధర్ రావు హరిబాబుపై చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

హరిబాబుకు మంత్రి పదవి ఇస్తారా అని మీడియా ఆయన్ను ప్రశ్నిస్తే.. మంత్రి పదవి ఇస్తారు కాకపోయినా ఏదో ఒకటి ఇస్తారు. అలా రోడ్డు మీద వదిలెయ్యరు కదా అని స్పందించారు. అంటే హరిబాబుకు మంత్రి పదవి ఇవ్వడం తెలంగాణ బీజేపీకి ఇష్టం లేదా అన్న కొత్త వాదన షురూ అయింది. హరిబాబు కంటే తమకేం తక్కువ అని చాలా మంది నేతలు అనుకుంటున్నారని మురళీ ఇచ్చిన ఆన్సర్ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు:

సోష‌ల్ మీడియాలో రాళ్ల‌దాడి వీడియో