ఇవేం మాటలు తొగాడియా

vhp-international-executive-president-praveen-togadia-made-sensational-comments-on-kashmir

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విశ్వ హిందూ పరిషత్ కాస్త హిందూ అతివాదం ఎక్కువే. అందుకే ఇన్నాళ్లైనా ఇతర మతాల ఆదరణ పొందలేకపోయింది. దేశభక్తి గురించి లెక్చర్లు దంచడం ఓకే కానీ.. మరీ అతి చేయడమే ఆ సంస్థతో వచ్చిన చిక్కు. ఇప్పుడు వీహెచ్ పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ కు ప్రత్యేక అధికారులు కల్పించే అధికరణపై సుప్రీంలో కేసు నడుస్తుండగా.. ప్రవీణ్ ఇలాంటి మాటలు మాట్లాడటం సంచలనంగా మారింది.

కశ్మీర్ లో సైన్యంపై రాళ్లు విసిరేవాళ్లకు బాంబులతో సమాధానం చెప్పాలని ప్రవీణ్ తొగాడియా కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థను, రాజ్యాంగాన్ని గౌరవిస్తామన్న తొగాడియా.. అందుకని దేశాన్ని అవమానిస్తే చూస్తూ ఉరుకునేది లేదని స్పష్టం చేశారు. కశ్మీర్ ఉగ్రవాదులకు కీలక సురక్షిత స్థావరంగా మారిందని, అక్కడి రాజకీయ పార్టీలు కూడా వారికి ఆశ్రయమిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

ఇప్పటికైనా ప్రభుత్వం కశ్మీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని ప్రవీణ్ సూచించారు. సోమనాథ్ ఆలయం కోసం ప్రత్యేక చట్టం తెచ్చినట్లే రామమందిరం, కశ్మీర్ కోసం కూడా అలాంటి చట్టాలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. దేశమంతా ఒకటేనని, కశ్మీర్ పౌరులకు ఇంకా ప్రత్యేక హక్కులు ఇవ్వడం సరికాదన్నారు తొగాడియా.

మరిన్ని వార్తలు:

చిన్నారుల‌కు ప్రేమ‌తో నేర్పిద్దాం…కోపంతో కాదు