సాయి పల్లవిని విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశాడా ?

లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. సాయి పల్లవి తొలి మూవీ అయిన ఫిదాలో ఆమె నటించిన నటనకి తెలుగు ఆడియన్స్ అందరూ ఫిదా అయిపోయారు. అప్పటినుండి ఆమె ఎన్నో సినిమాలు చేసుకుంటూ వచ్చింది. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నది ఈ బ్యూటీ. ముఖ్యంగా తనకు పాత నచ్చి ఆ మూవీ ద్వారా తనకు, తన పాత్రకు మంచి గుర్తింపు లభిస్తుంది అంటేనే ఆ మూవీ లో అవకాశాలను అంగీకరిస్తుంది.

సాయి పల్లవిని విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశాడా ? - Telugu Bullet

లేదంటే కోట్లు కుమ్మరించినా సరే ఆ పాత్ర చేయనని ముఖం మీదే చెప్పడంలో సాయి పల్లవి తర్వాతే ఎవరైనా అని చెప్పారు. అందుకే హీరోలకు ఎంత ఫాలోయింగ్ ఉందో సాయి పల్లవికి కూడా అంతే ఫాలోయింగ్ ఉంటుంది . అంతేకాదు, ఈమె స్కిన్ షోలకి చాలా దూరం. పద్ధతిగా ఉండే పాత్రలతోనే ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అయితే అలాంటి సాయి పల్లవిని రిజెక్ట్ చేశారంట విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం పరశురాం దర్శకత్వంలో రాబోతుంది.

ఈ సినిమాలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా సాయి పల్లవినే అనుకున్నారట దర్శకుడు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం తన బాడీ లాంగ్వేజ్ కి, సాయి పల్లవికి ఈ స్టోరీకి అసలు సెట్ కాదని.. ఆమె వద్దంటే వద్దని చెప్పేశారంట . దీంతో చేసేదేం లేక దర్శకుడు మృణాళ్ ని తీసుకున్నారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.