బాలయ్యే కాదు మెగాస్టార్ కూడా అఘోరా పాత్రలో నటించారు.. ఆ సినిమా ఎదో తెలుసా..?

బాలయ్యే కాదు మెగాస్టార్ కూడా అఘోరా పాత్రలో నటించారు
Latest News

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన ఈ మూవీ భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలయ్య అఘోరా పాత్రలో కనిపించి మెప్పించారు. అంతకు ముందు బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ మూవీ లు భారీ విజయాలను అనుకున్నాయి. ఆ మూవీ లను మించి అఖండ సినిమా విజయం సాధించింది. ఇక అఖండ చిత్రం లో శివ భక్తుడుగా బాలయ్య అద్భుతంగా నటించారు. అఘోర పాత్రలో బాలయ్య యాక్షన్స్ సీన్స్ కూడా ఇరగదీశారు. ఇదిలా ఉంటే బాలకృష్ణతో పాటు చిరంజీవి కూడా ఒక సినిమాలో అఘోరా గా నటించి మెప్పించారు. ఆ సినిమా ఎదో తెలుసా..?

బాలయ్యే కాదు మెగాస్టార్ కూడా అఘోరా పాత్రలో నటించారు.. ఆ సినిమా ఎదో తెలుసా..?
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. చిరంజీవి చేయని పాత్ర అంటూ ఏది ఉండదేమో అని అనడం లో అతిశయోక్తి లేదు. పునాది రాళ్లు మూవీ నుంచి మొదలుకొని ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఇక మెగాస్టార్ అఘోర పాత్రలో నటించినమూవీ ఎదో తెలుసా అది శ్రీ మంజునాథ.

శ్రీ మంజునాథ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ లో అర్జున్ , సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే ఈ మూవీ శివుని పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించి మెప్పించారు. ఇక ఇదే మూవీ లో ఆయన పలు గెటప్స్ లో కనిపించారు. వాటిలోనే అఘోర గెటప్ ఒకటి. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మెగాస్టార్ శివునిగా.. మీనా పార్వతి దేవిగా నటించి మెప్పించారు. ఈ సినిమాకు హంసలేఖ సంగీతం అందించారు. అలాగే ఈ మూవీ లో కన్నడ నటుడు అంబరీష్ కూడా నటించారు.