ఎన్టీఆర్‌ కెరీర్‌లో 5వ సారి..!

Jr NTR Jai Lava Kusa Became The Million Dollar In Overseas

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ హీరోలు ఇటీవల ఓవర్సీస్‌లో భారీ వసూళ్లను రాబడుతున్నారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నటించిన దాదాపు అన్ని సినిమాలు ఇటీవల ఓవర్సీస్‌లో మిలియన్‌ డాలర్లను సునాయాసంగా వసూళ్లు చేశాయి. ఇక ఎన్టీఆర్‌ సినిమాలు కూడా వరుసగా ఓవర్సీస్‌లో కలెక్షన్స్‌ సునామి సృష్టిస్తున్నాయి. ‘బాద్‌షా’తో ప్రారంభం అయిన ఈ సునామి తాజాగా ‘జైలవకుశ’ చిత్రంకు కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఏకంగా అయిదు సినిమాలు ఓవర్సీస్‌ వద్ద మిలియన్‌ డాలర్లు, అంతకు మించి వసూళ్లు చేశాయి.

‘బాద్‌షా’, ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌’ చిత్రాలు ఇప్పటికే ఓవర్సీస్‌లో మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేసిన చిత్రాల జాబితాలో నిలిచాయి. ఇక ఎన్టీఆర్‌ తాజాగా ఈ చిత్రంతో కూడా మరోసారి మిలియనీర్‌ జాబితాలో చేరాడు. ‘జైలవకుశ’ చిత్రంపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో సినిమాకు భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. మొదటి వారాంతంలోనే ఈజీగా మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేయడం ఖాయం అంటూ ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. లాంగ్‌ రన్‌లో 1.75 నుండి 2 మిలియన్‌ డాలర్ల వరకు వసూళ్లు చేయగలదన్న నమ్మకం వ్యక్తం అవుతుంది.