ధోనితో మాత్రమే కాదు, ఇంకా నలుగురితో అఫైర్‌ ఉండేది

Lakshmi Rai Gives Clarity About Her Relationship With Her Boy Friends

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు మరియు తమిళంలో హీరోయిన్‌గా నటించిన రాయ్‌ లక్ష్మీకి పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ అమ్మడు లారెన్స్‌తో అఫైర్‌ కారణంగా ‘కాంచన’ వంటి హిట్‌ సినిమాలో ఛాన్స్‌ దక్కించుకుంది. అయితే ఆ సినిమా ఈమెకు పెద్దగా గుర్తింపును తీసుకు రాలేక పోయింది. పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్‌ చేసిన ఈ అమ్మడు సౌత్‌లో ఆశలు వదిలేసి బాలీవుడ్‌కు చెక్కేసింది. బాలీవుడ్‌లో ఈ అమ్మడికి అనుకోని అవకాశం మాదిరిగా ‘జూలీ 2’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశంను వినియోగించుకునేందుకు ఈ అమ్మడు విచ్చలవిడిగా అందాలను ఆరబోసింది.

ట్రైలర్‌లోనే చుక్కలు చూపించిన ఈ అమ్మడు సినిమాతో మరింత బోల్డ్‌ కంటెంట్‌ను చూపించబోతుంది. ‘జూలీ 2’ ఒక బోల్డ్‌ సినిమా అని అంతా అనేస్తున్నారు, ఇక ఆ సినిమా ప్రమోషన్‌లో రాయ్‌ లక్ష్మి మాటలు కూడా చాలా బోల్డ్‌గా ఉంటున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం క్రికెటర్‌ ధోనితో ఈ అమ్మడికి అఫైర్‌ ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలను ఆమె ముందు ప్రస్తావించగా తాను కేవలం ధోనీతోనే కాకుండా ఇంకా నలుగురితో అఫైర్‌ను పెట్టుకున్నాను అని, వారి గురించి ఎందుకు ఎవరు రాయడం లేదని, వారు కూడా పెద్ద ప్రముఖులే అంటూ వ్యాఖ్యలు చేసింది. ఆ నలుగురు ఎవరు అనే విషయం మీ అందరికి కూడా తెలుసు. గతంలో వార్తలు రాశారు. కాని ఇప్పటికి కూడా ధోనినే ఎక్కువ ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు అంటూ ఈ అమ్మడు మీడియాను ప్రశ్నించింది.