పాండ్యా దృష్టంతా క్రికెట్ పైనే… అమ్మాయిల‌పై కాదు…

Himanshu Pandya clarity about on Hardik Pandya Love Affairs

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భార‌త క్రికెట్ తాజా సంచ‌ల‌నం హార్దిక్ పాండ్యా పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలీవుడ్ న‌టి ప‌రిణీతి చోప్రా ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసిన ఓ ఫొటోకు కామెంటు పెట్ట‌డం ద్వారా నెటిజ‌న్ల‌కు దొరికిపోయిన పాండ్యా పై అప్ప‌టినుంచి రూమ‌ర్లు కొన‌సాగుతూనే ఉన్నాయి. పాండ్యా, ప‌రిణీతి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం చాలా దూరం వెళ్లిపోయింద‌ని, వాళ్లిద‌రూ డేటింగ్ కూడా చేస్తున్నార‌ని వార్త‌లొచ్చాయి. అమ్మాయిల‌పై కాదు… ఆట‌పై శ్ర‌ద్ధ పెట్టు అంటూ నెటిజ‌న్లు పాండ్యాకు ఉచిత స‌ల‌హాలు కూడా ఇచ్చారు.

అయితే డేటింగ్ వార్త‌ల‌ను అటు పాండ్యా, ఇటు ప‌రిణీతి ఇద్ద‌రూ ఖండించారు. ఈ పుకారు త‌ర్వాత హార్దిక పాండ్య ల‌వ్ ఎఫైర్ గురించి మ‌రో వార్త హ‌ల్ చ‌ల్ చేసింది. మోడ‌ల్ శివానీ దండేక‌ర్ తో పాండ్యా చ‌నువుగా ఉంటున్నాడ‌ని పుకార్లొచ్చాయి. తాజా రూమ‌ర్ పై హార్దిక్ పాండ్యా స్పందించ‌లేదు కానీ… ఆయ‌న తండ్రి హిమాన్షు పాండ్యా మాత్రం వివ‌ర‌ణ ఇచ్చారు. హార్దిక్ పాండ్యాపై అమ్మాయిల‌కు ఆస‌క్తి ఎందుకు క‌లుగుతోందో త‌న‌కు అర్ధం కావ‌డం లేద‌ని న‌వ్వుతూ వ్యాఖ్యానించారు తండ్రి.

భార‌త జ‌ట్టుకు ఆడుతుండ‌డంతో పాటు… పాండ్యా ఆట‌తీరువ‌ల్ల ఇలాంటి స‌మ‌స్య ఎదురై ఉండొచ్చ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఇదేమీ పెద్ద స‌మ‌స్య కాద‌ని, ప్ర‌తి క్రికెట‌ర్ కూ ఇలాంటి స‌మస్య‌లు ఎదుర‌వుతూనే ఉంటాయ‌ని అన్నారు. హార్దిక్ పాండ్యా చాలా దృఢంగా ఉంటాడ‌ని, అమ్మాయిల వ‌ల్ల క్రికెట్ పై అత‌ని ఫోక‌స్ ఏమాత్రం త‌గ్గ‌ద‌ని హిమాన్షు పాండ్య కొడుకుపై విశ్వాసం వ్య‌క్తంచేశాడు. పాండ్యా దృష్టి మొత్తం క్రికెట్ పైనే ఉందని, ఇటీవ‌లే వ‌న్డేలో వ‌రుస‌గా మూడు సిక్స్ లు బాదాడ‌ని, ఒకే ఓవ‌ర్ లో ఆరు సిక్సులు ఎప్పుడు కొడ‌తాడా అని తాము ఎదురుచూస్తున్నామని హిమాన్షు పాండ్యా చెప్పాడు.