రానా క్రేజ్‌ మామూలుగా లేదుగా..!

rana-daggubati-got-25-lakhs-for-acting-in-a-company-advertisement

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హీరోగా కొన్ని సినిమాల్లోనే నటించాడు, హీరోగా భారీ క్రేజ్‌ రానాకు ఏమీ లేదు, కాని ‘బాహుబలి’ చిత్రంలో విలన్‌గా నటించడం వల్ల మంచి గుర్తింపు వచ్చింది. ఇటీవల ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో నటించడంతో హీరోగా కమర్షియల్‌ సక్సెస్‌ దక్కింది. ఇప్పుడు రానా వెబ్‌ సిరీస్‌లో నటించడంతో పాటు, నెం.1 యారీ విత్‌ రానా షోను చేస్తున్నాడు. ఈ షోకు మంచి రేటింగ్‌ రావడంతో పాటు, భారీగా రానాకు క్రేజ్‌ను తీసుకు వచ్చింది. తన క్రేజ్‌ను రానా ఫుల్‌గా వాడేసుకుంటున్నారు. పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ రెండు చేతులతో సంపాదిస్తున్నాడు.

తాజాగా ఒక కంపెనీ యాడ్‌లో నటించేందుకు రానా ఏకంగా 25 లక్షలను పొందాడు. కేవలం ఒక్క రోజు షూట్‌లో పాల్గొనడం ద్వారా రానాకు ఆ మొత్తం వచ్చింది. ఆరు నెలల పాటు రానా నటించిన ఆ యాడ్‌లను సదరు సంస్థ ప్రసారం చేసుకుంటూ ఉంటుంది. కొన్ని గంటల చిత్రీకరణలో పాల్గొనడంతో రానాకు ఈ స్థాయిలో పారితోషికం దక్కింది అంటే ఏ స్థాయిలో రానా క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రానా తెలుగుతో పాటు తమిళంలో కూడా రెండు సినిమాలను ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలే ఒక హాలీవుడ్‌ సినిమాలో కూడా ఈయన నటించేందుకు సైన్‌ చేశాడు.