బాలయ్యని ఎన్టీఆర్ ఛాలెంజ్ చేస్తున్నాడా?

jr ntr may play Sr NTR role in mahanati savitri biopic movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రని సినిమాగా తీయడానికి నటసింహం బాలయ్య రెడీ అవుతున్నారు. పైసా వసూల్, రెడ్డి గారు సినిమాలు జరిగే టైం లోనే ఎన్టీఆర్ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ చేసే పనిని కొందరు రచయితలకు అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి దర్శకుడు ఎవరో ఇంకా తెలికపోయినా ఎన్టీఆర్ క్యారెక్టర్ వేసేది మాత్రం బాలయ్య అని తెలిసిపోతోంది. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. అయితే బాలయ్య కన్నా ముందుగానే జూనియర్ కి తాత ఎన్టీఆర్ పాత్ర పోషించే అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తీస్తున్న సావిత్రి సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కోసం ఇప్పటికే జూనియర్ ని అడిగారట. ఎన్టీఆర్ దానికి ఎస్ చెప్పాలా, నో చెప్పాలా అని ఆలోచనలో వున్నాడట.

మాములుగా అయితే తాత ఎన్టీఆర్ పాత్ర పోషించే అవకాశం వస్తే జూనియర్ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదిలిపెట్టడు. యమదొంగలో గ్రాఫిక్స్ తో సీనియర్ ఎన్టీఆర్ సృష్టి, బాద్షా లో జస్టిస్ చౌదరి వేషధారణ చూస్తే తాత పాత్రలంటే ఎన్టీఆర్ కి ఎంత మమకారమో అర్ధం అయిపోతుంది. అయితే బాబాయ్ బాలయ్య ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమా తలపెట్టడం, తనతో సంబంధాలు అంతంత మాత్రం గానే ఉండటం తో అబ్బాయి ఆలోచనలో పడ్డాడంట. ఒకవేళ ఎన్టీఆర్ గనుక సావిత్రి సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చేయడానికి సై అంటే బాబాయ్ బాలయ్యకి ఛాలెంజ్ విసిరినట్టే. అది జరిగితే నందమూరి ఫాన్స్ పంట పండినట్టే. ఎన్టీఆర్ పాత్రలో తమ అభిమాన నటులు ఇద్దరినీ చూసుకునే అవకాశం వారికి దొరుకుతుంది.కాదంటారా?

మరిన్ని వార్తలు

డీజే దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ .

మతి పోగొడుతున్న ‘డీజే’ లెక్కలు

బాలయ్యకు వీరిద్దరే దిక్కా?