బాలయ్యకు వీరిద్దరే దిక్కా?

balayya next movie heroines Radhika Apte, Shriya, Nayanatara

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Three Heroines In Balakrishna Movie

నందమూరి బాలకృష్ణ సినిమాల్లో నటించేందుకు స్టార్‌ హీరోయిన్స్‌ ఆసక్తి చూపించరు అనే టాక్‌ ఒకటి ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంది. అందుకే బాలయ్య సినిమాల్లో సెకండ్‌ గ్రేడ్‌ హీరోయిన్స్‌ లేదా కొత్త వారు మాత్రమే నటిస్తూ ఉంటారు. ఈయనతో నటించేందుకు కొత్త వారు మరియు స్టార్‌ హీరోయిన్స్‌ నో చెబుతున్న నేపథ్యంలో నటించిన వారితోనే మళ్లీ మళ్లీ నటిస్తున్నాడు బాలయ్య. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంలో తనతో చేసిన శ్రియతో ప్రస్తుతం పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రొమాన్స్‌ చేస్తున్నాడు.

ఇక బాలయ్య 102వ సినిమాలో కూడా పాత హీరోయిన్‌ నటించబోతుంది. బాలయ్యతో ఇప్పటికే ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’ చిత్రాలను చేసిన నయనతార సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య 102వ సినిమా తమిళ దర్శకుడు కెఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. సి కళ్యాణ్‌ నిర్మించనున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌ నటించనున్నారు. అందులో ఒక హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ కోరిక మేరకు నయన్‌ను భారీ పారితోషికం ఇచ్చి ఎంపిక చేయాలని నిర్ణయించారు. బాలయ్యకు రాధిక ఆప్టే, శ్రియ, నయన్‌ తప్ప మరే హీరోయిన్స్‌ కనిపించడం లేదని, అందుకే బాలయ్య వారే దిక్కు అన్నట్లుగా వారితోనే చేస్తున్నాడంటూ కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్‌ అంటున్నారు.

మరిన్ని వార్తలు

డీజే దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ .

బాలయ్యకు వీరిద్దరే దిక్కా? - Telugu Bullet