పవన్‌ సునీల్‌ అంటే… త్రివిక్రమ్‌ వెంకీ అన్నాడట!

Pawan-kalyan-And-Trivikram-

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Pawan kalyan And Trivikram Movie Guest Role Playing By Venkatesh

పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో అయిదు నిమిషాల పాటు వెంకటేష్‌ కనిపించబోతున్న విషయం తెల్సిందే. నేడు అందుకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తి అయ్యింది. ‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత పవన్‌, వెంకీ కలిసి నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఆ గెస్ట్‌ రోల్‌ను మొదట సునీల్‌తో చేయించాలని సునీల్‌ భావించాడు. అదే విషయాన్ని త్రివిక్రమ్‌కు చెప్పగా ఆ సమయంలో సరే అన్నాడట. తీరా ఆ సీన్‌ను చిత్రీకరించేందుకు సమయం ముంచుకు రావడంతో వెంకటేష్‌తో ఆ సీన్‌ను చేయిద్దాం అంటూ త్రివిక్రమ్‌ చెప్పాడట.

త్రివిక్రమ్‌ ఆలోచన నచ్చిన పవన్‌ వెంటనే ఓకే చెప్పాడు. త్రివిక్రమ్‌ చెప్పడం వెంకీ వెంటనే నటించేందుకు ఒప్పుకోవడం షూటింగ్‌ కూడా పూర్తి కావడం అంతా చకచక జరిగిపోయింది. భారీ అంచనాలున్న ఈ సినిమాలో వెంకటేష్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. సునీల్‌ ఆ గెస్ట్‌ రోల్‌ చేస్తే అంత క్రేజ్‌ ఉండక పోయేది. త్రివిక్రమ్‌ తెలివిగా ఆలోచించి వెంకీని తీసుకు రావడంతో పవన్‌ ఫ్యాన్స్‌ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా కీర్తి సురేష్‌ మరియు అను ఎమాన్యూల్‌ు నటిస్తున్నారు. దీపావళికి ఈ సినిమా వచ్చే అవకాశాలున్నాయి.