పవన్‌ ఫ్యాన్స్‌ పండగ చేసుకునే వార్త

pawan kalya and trivikram new film first look from ramjan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Pawan Kalya And Trivikram New Film First  Look Will Be On Ramjan

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత వస్తున్న సినిమాపై అందరి అంచనాలు ఉన్నాయి. భారీ స్థాయిలో త్రివిక్రమ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన విషయాలను బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ కోసం ఫ్యాన్స్‌ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. పలు టైటిల్స్‌ ప్రచారం అవుతున్నా అధికారికంగా మాత్రం టైటిల్‌ను ప్రకటించలేదు. ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్‌ను ప్రకటించే సమయం వచ్చింది.

పవిత్ర రంజాన్‌ పర్వదినం సందర్బంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే టైటిల్‌ మరియు ఫస్ట్‌లుక్‌పై ఒక నిర్ణయంకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పవన్‌ ఫ్యాన్స్‌కు నచ్చే విధంగా, సినిమాపై అంచనాలు పెంచే విధంగా టైటిల్‌ మరియు ఫస్ట్‌లుక్‌ ఉండాలనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్‌ కాస్త ఎక్కువ శ్రద్దే తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సారధి స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నారు. చిత్రం ఫస్ట్‌లుక్‌ వార్త ఫ్యాన్స్‌లో ఫుల్‌ ఖుషీని నింపుతుంది. ఇక ఫస్ట్‌లుక్‌ వచ్చిన తర్వాత ఫ్యాన్స్‌ ఇంకా ఎంత సంతోషిస్తారో చూడాలి.

మరిన్ని వార్తలు

డీజే దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ .

ఆడియో వేడుకకు అన్ని కోట్లు ఏందుకురా బుజ్జి!

ఎన్టీఆర్ పాట పాడుతున్న మెగా హీరో.