ప్రభాస్‌కు షాక్‌ ఇచ్చిన జక్కన్న

Prabhas Shocked In Rajmouli About Bahubali3

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Prabhas Shocked In Rajmouli About Bahubali3

అయిదు సంవత్సరాల పాటు ‘బాహుబలి’ సినిమాను తెరకెక్కించి ప్రభాస్‌ ఇమేజ్‌ను ఆకాశంలో పెట్టిన దర్శకుడు రాజమౌళి. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘బాహుబలి 2’ ఇండియాలో అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడిప్పుడే బాహుబలి సందడి తగ్గుతుంది. ఇక బాహుబలిలో భల్లాలుడిగా నటించిన రానా హోస్ట్‌గా జెమిని టీవీలో నెం.1 యారి విత్‌ రానా అనే కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఆ కార్యక్రమంలో బాహుబలి నిర్మాతతో కలిసి రాజమౌళి పాల్గొన్నాడు.

కార్యక్రమంలో భాగంగా రాజమౌళి ఒక ఫేక్‌ కాల్‌ చేయాల్సి ఉంటుంది. ఆ ఫేక్‌ కాల్‌ను ప్రభాస్‌కు చేశాడు జక్కన్న. తాను రానా షోలో ఉన్నాను అని చెప్పకుండా ప్రభాస్‌ లిప్ట్‌ చేయగానే డార్లింగ్‌ వెంటనే కవాలి అన్నాడు. ఎందుకు డార్లింగ్‌ అంటూ ప్రభాస్‌ ప్రశ్నించాడు. బాహుబలి 3 గురించి మాట్లాడాలి అనగానే ప్రభాస్‌ షాక్‌ అయ్యి అమ్మ నీ యమ్మ అన్నాడు. వారిద్దరి మద్య పూర్తి సంభాషణ ఏంటి అనేది కార్యక్రమం ప్రసారం అయితే కాని తెలియదు. ప్రభాస్‌ నమ్మాడా, రాజమౌళి ఇంకా ఎలా ప్రభాస్‌కు షాక్‌ ఇచ్చాడు అనేది కార్యక్రమంలో తెలిసే అవకాశం ఉంది. నిజానికి రాజమౌళికి ‘బాహుబలి 3’ ఆలోచనే లేదు. కాని రానా షోలో జోక్‌గా ప్రభాస్‌కు షాక్‌ ఇచ్చాడు.


మరిన్ని వార్తలు:

ప్రభాస్‌కు షాక్‌ ఇచ్చిన జక్కన్న - Telugu Bullet