విమానంలో మహేష్… గుట్టు విప్పని మురుగదాస్

mahesh spyder movie new look release

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

స్పైడర్ సినిమా మొదలు అయినప్పటినుంచి దర్శకుడు మురుగదాస్ మీద మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహంగా వున్నారు. సినిమా లేట్ చేస్తున్నాడని ఓ కారణం అయితే, దానికి సంబంధించిన విషయాలు ఏమీ బయటకు రాకపోవడం ఇంకో కారణం. ఈ పరిస్థితుల్లో ఇటీవల విడుదలైన స్పైడర్ టీజర్ వారి కోపాన్ని చల్లార్చింది. జస్ట్ ఒక్క షాట్ తోనే మహేష్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసిన మురుగదాస్ అప్పటినుంచి సినిమాకి సంబంధించిన విషయాలు కొన్ని సెలెక్టివ్ గా లీక్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు స్పైడర్ కి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ కొన్ని అలాగే బయటికి వచ్చాయి.

విమానం ఎక్కేటప్పుడు హడావుడిని కేప్చర్ చేసే ఈ షాట్ లో మహేష్ ని మనం చూడొచ్చు. విమానంలో మహేష్ ఫోటోస్ బ్లాక్ అండ్ వైట్ తో పాటు కలర్ లో బయటికి వచ్చాయి. అయితే స్పైడర్ పబ్లిసిటీ ని ఇలా నాచురల్ గా ప్లాన్ చేస్తున్న మురుగదాస్ స్టోరీ లేదా సినిమా కంటెంట్ అనే గుట్టు విప్పకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సినిమా రిలీజ్ అయ్యే దాకా ఈ విషయంలో మురుగదాస్ రాజీ పడేట్టు కనిపించడం లేదు. సో మహేష్ ఫ్యాన్స్ కి స్పైడర్ రిలీజ్ దాకా ఈ సస్పెన్స్ తప్పదు.

మరిన్ని వార్తలు