రోజా మారుతుందా… పార్టీనే మార్చేస్తుందా?

ys jagan fires on MLA roja

రోజా అనగానే ఆమె సినిమాలకన్నా ముందు ఫైర్ బ్రాండ్ రాజకీయ ప్రకటనలే గుర్తుకు వస్తాయి. ఒకప్పుడు ఆ దూకుడుదనం చూసే ఆమెని ఆమెని దగ్గరకు తీసిన వైసీపీ కి ఇప్పుడు అదే వ్యవహారం నచ్చడంలేదట. టీడీపీ నుంచి బయటికి వచ్చాక రోజా దూకుడు ఏ లెవెల్ లో పెరిగింది అందరూ చూస్తూనే వున్నారు. అసెంబ్లీ లో ఆ దూకుడే ఆమెని కొన్నాళ్ళు సభకు కూడా దూరం చేసింది. అయినా ఆమెని వెనుకేసుకొచ్చిన వైసీపీ అధినేత జగన్ తాజాగా నోటిదూకుడు తగ్గించుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు పార్టీ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి కారణం వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ అని తెలుస్తోంది. తాను చేసిన సర్వే గణాంకాల ఆధారంగా రోజా నోటిదూకుడు వల్ల పార్టీకి నష్టమని చెప్పడంతో జగన్ ఈ రేంజ్ లో ఫైర్ అయ్యారట. ఇప్పటికీ పద్ధతి మార్చుకోకపోతే పార్టీలో స్థానం ఉండదని తీవ్రస్థాయిలో హెచ్చరించారట.

రోజా ని దగ్గరగా చూసిన వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం జగన్ నిజంగా ఆ స్థాయిలో వార్నింగ్ ఇస్తే ఆమె పార్టీలో ఇమడటం కష్టమే అంటున్నారు. జగన్ వార్నింగ్ తో ఆమె మారే ప్రసక్తే లేదని, అవసరం అనుకుంటే పార్టీ నే మార్చేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఒకప్పటి రోజా నిజంగా అలా ఉండేదేమో గానీ ఇప్పుడు ఆమెలో చాలా మార్పు వచ్చిందని ఇంకొందరి వాదన. సోషల్ మీడియాలో జగన్ తనను కోప్పడినట్టు వార్తలు వస్తుంటే కూడా ఆమె మౌనం దాల్చడం వెనుక ఓ వ్యూహం ఉందంటున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నగరి రాజకీయ పరిస్థితుల్ని బేరీజు వేసుకుని కాస్త మౌనం పాటిస్తున్నారని చెబుతున్నారు. ఈ మౌనం వెనుక అంతకుమించిన కారణం కూడా కనిపిస్తోందట. ఆమెని నాగబాబు జనసేనలోకి ఆహ్వానించాడట. ఆ ఇద్దరూ జబర్దస్త్ లో పని చేస్తున్నప్పటికీ పవన్ వ్యవహారశైలి తెలిసిన వాళ్ళు రోజాకి పిలుపు ఇవ్వడం అసాధ్యం అంటున్నారు. ఏదేమైనా ఫైర్ బ్రాండ్ లా మాట్లాడే ఈ మౌనం వీడి వివరణ ఇచ్చే దాకా ఇలాంటి ఊహాగానాలు బయటికి వస్తూనే ఉంటాయి.