ఎన్టీఆర్‌ ‘బిగ్‌ బాస్‌’కు చేదు అనుభవం

Celebrapists Are Not Interested To Participating In The BIG BOSS SHOW.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Celebrates Are Not Interested in Participating To The BIG BOSS SHOW.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బుల్లి తెరపై ‘బిగ్‌బాస్‌’ షోతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హిందీలో బాగా ఫేమస్‌ అయిన ‘బిగ్‌బాస్‌’ షోను అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. హిందీలో ఇప్పటి వరకు పది సీజన్‌లు పూర్తి అయ్యాయి. ప్రతి సీజన్‌లో కూడా పార్టిసిపెంట్లు వివాదాస్పదం అవుతూనే ఉన్నారు. కొన్ని ఎపిసోడ్‌లలో వివాదాలు మరింతగా ముదిరిన సందర్బాలు ఉన్నాయి. అయితే తెలుగులో మాత్రం పెద్దగా వివాదాలు లేకుండానే చిత్రీకరించాలని భావిస్తున్నారు.

హిందీ బిగ్‌బాస్‌ షోలో సెలబ్రెటీలతో పాటు సామాన్యులు కూడా ఉంటారు. అయితే ఎన్టీఆర్‌ ‘బిగ్‌బాస్‌’ షోలో మాత్రం కేవలం సెలబ్రెటీలనే తీసుకోవాలని భావిస్తున్నారు. కాని సెలబ్రెటీలు ఈ షోలో పాల్గొనేందుకు పెద్దగా ఆశక్తి చూపుతున్నట్లుగా లేదు. స్టార్‌ మాటీవీ వారు ఇటీవల ఒక స్టార్‌ హీరో కూతురును ఇందుకోసం సంప్రదించడం జరిగింది. ఆమె ఈ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించలేదు. అలాగే ఒక ప్రముఖ దర్శకుడి కూతురు కూడా ఈ షోలో పాల్గొనేందుకు నో చెప్పింది. ఇలా పలువురు సెలబ్రెటీలు నో చెబుతుండం బిగ్‌బాస్‌ షోకు చేదు అనుభవంగా చెప్పుకోవచ్చు. మొదటి సీజన్‌ పూర్తి అయితే రెండవ సీజన్‌కు సెలబ్రెటీలు ఎగబడి మరీ వస్తారని స్టార్‌ మా ఆశిస్తుంది. ఈ సీజన్‌ను ఎలా మొదలు పెట్టాలా అని ప్రస్తుతం స్టార్‌ మా దిగులు పడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. అబ్బాయిలు చాలా మందే ఆసక్తిగా ఉన్నా టాలీవుడ్‌కు చెందిన తెలుగు అమ్మాయిలు మాత్రం ముందుకు రావడం లేదు.


మరిన్ని వార్తాలు:

డీజే దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ .

బాలయ్యని ఎన్టీఆర్ ఛాలెంజ్ చేస్తున్నాడా?

ఐవైఆర్ కి వైసీపీ పరీక్ష పెట్టింది.