మ‌హేష్‌, వంశీ పైడిప‌ల్లి కూతుళ్ళ సంద‌డి చూశారా..!

aadya vs sitara 3 markers challenge

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కూతుళ్ళు సితార‌, ఆద్య‌లు యాట్యూబ్ వేదిక‌గా సంద‌డి చేస్తున్నారు. 3 మార్క‌ర్ ఛాలెంజ్ అంటూ వారు చేస్తున్న సంద‌డి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. వారిద్ద‌రు క‌ల‌సి సంద‌డి చేసిన యూ ట్యూబ్ వీడియోని మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేస్తూ..ఆ పిల్ల‌లిద్ద‌రికి బెస్ట్ విషెస్ అందించారు. అంతేకాదు యూ ట్యూబ్ వేదిక‌గా వారు చేసిన ఫ‌ర్‌ఫార్మెన్స్‌ని ఎంజాయ్ చేయండని కూడా పేర్కొన్నాడు. గ‌తంలో ఆద్య‌, సితార .. మ‌హ‌ర్షి చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో దేవి శ్రీ ప్రసాద్‌తో క‌లిసి సందడి చేశారు. అప్పుడు వీరి హంగామాకి నెటిజ‌న్స్ ఫిదా అయ్యారు.