కన్నకూతురి మీదే రేప్…పసిపాప అని కూడా చూడకుండా !

rape on daughter

అసలే కామాంధుడు అందునా మందు తాగి ఉన్నాడు. ఈ క్రమంలో ఆ మద్యం మత్తులో కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. కన్నతండ్రి బంధానికే మాయని మచ్చ తెచ్చిన ఈ ఘటన రాజస్థాన్‌లోని బిల్వారా పట్టణంలో చోటుచేసుకుంది. కన్నతండ్రే కత్తితో బెదిరిస్తూ తనపై చేస్తున్న అఘాయిత్యాన్ని బాలిక బయటపెట్టడంతో నిందితుడిపై కేసు నమోదుచేశారు పోలీసులు. రాజస్థాన్‌లోని బిల్వారా పట్టణంలో ఓ వ్యక్తి తల్లితో కలిసి నివసిస్తున్నారు. అతడు మద్యానికి బానిస కావడంతో ఏడాది క్రితం భార్య కూతురితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల తల్లి పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను తండ్రి తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఒకరోజు మద్యం మత్తులో ఆమె మీద అత్యాచారం జరిపాడు. కన్న కూతురని కూడా చూడకుండా రోజూ ఆమెను తన గదిలో బందించి రోజూ అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని చెప్పడంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. అయితే తండ్రి అరాచకం మరింత పెరిగిపోవడంతో ధైర్యం తెచ్చుకున్న బాలిక ఈ విషయాన్ని నాయనమ్మకు చెప్పింది. దీంతో ఆమె బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించామని, వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.