ఇటీవల మన టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యిన రీ రిలీజ్ ల ట్రెండ్ ఎలా హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. మరి దీనిని తెలుగు మూవీ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తమ అబిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా పోకిరి రీరిలీజ్ తో స్టార్ట్ చేసి మొన్న మురారి వరకు తీసుకొచ్చారు. మరి ఈ అన్ని మూవీ లు కూడా భారీ హిట్స్ అయ్యి రికార్డు వసూళ్లు సొంతం చేసుకున్నాయి.
![రీరిలీజ్ ట్రెండ్‌పై మహేష్ బాబు ఏమన్నారంటే? What does Mahesh have to say about his re-releases?](https://i0.wp.com/telugu.telugubullet.com/wp-content/uploads/2024/11/Mahesh-Babu-.-1-2.jpg?resize=300%2C197&ssl=1)
ఇక ఈ రీ రిలీజ్ లపై అసలు మహేష్ ఏమనుకుంటున్నారో ఇపుడు రివీల్ చేసారు . పోకిరి నుంచి మొదలైన ఈ ఫినానిమల్ రెస్పాన్స్ మళ్లీ నన్ను ప్రతీసారి పాత రోజుల్లోకి తీసుకెళ్తుంది అని నా అభిమానులకు వారి ప్రేమకి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిజేస్తున్నాను అని మహేష్ తెలిపారు. దీనితో ఈ కామెంట్స్ ఫ్యాన్స్ ల లో మరింత ఆనందాన్ని నింపాయి.