ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నెల తిరగకుండానే ఆనందం ఆవిరైపోయింది

సామాజిక వర్గాలు వేరైనా వారి ప్రేమకు ఎవరు అడ్డురాలేదు. మనసులు కలిసి పెద్దల ఆశీర్వాదంతో ఒక్కటయ్యారు. కొత్తకాపురం ఆనందంగా సాగుతున్న వేళ విధి వారిని అతలాకుతం చేసింది . రోడ్డు ప్రమాదం లో కొత్తజంటను బలితీసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న 28 రోజులకే ఇద్దరూ మృతిచెందారు .. ఆ రెండు కుటుంబాల్లో దుఃఖాన్ని నింపివేసింది . నకిరేకల్‌- నాగార్జునసాగర్‌- గుంటూరు 565వ నెంబర్‌ జాతీయ రహదారిపై తాటికల్‌ గ్రామం వద్ద సెప్టెంబర్‌ 13 రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మహేశ్‌ , రిషిత వీళ్లిద్దరు మృతిచెందారు.

Video : https://youtu.be/EyKJS_Jg91g

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కేతేపల్లి మండలం గుడివాడకు చెందిన మహేశ్‌, రిషిత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ గుడివాడే అయినా యువతి పుట్టింటి వారు నల్గొండలో నివాసం ఉంటారు . 28 రోజుల క్రితమే వారు ప్రేమ వివాహం చేసుకుని గ్రామంలో కొత్త కాపురం కూడా పెట్టారు. మహేశ్‌ ఇతర రాష్ట్రాలకు వెళ్లి కల్లుగీసే వృత్తిని చేస్తుంటారు. బుధవారం నల్గొండ వెళ్లి భార్య,భర్తలిద్దరూ ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నారు. తాటికల్‌ గ్రామం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టరు , వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. వాళ్లిద్దరూ అక్కడిక్కడే మూర్తి చెందారు .