పెళ్లి గురించి శృతిహాసన్ ఏమందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

పెళ్లి గురించి శృతిహాసన్ ఏమందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!
Latest News

తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ గురించి దాదాపు అందరికీ తెలుసు . అందం, అభినయం మాత్రే కాదు.. సింగింగ్ లో కూడా తన సత్తా చాటి తండ్రికి తగ్గ తనయగా మంచి గుర్తింపు ని సంపాదించుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి నటించి బ్లాక్ బస్టర్స్ ని అందుకుంది శృతిహాసన్. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శృతి తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పలు విశేషాలను తన అభిమానులతో అప్పుడప్పుడు పంచుకుంటూ ఉంటుంది.

పెళ్లి గురించి శృతిహాసన్ ఏమందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!
Surthi Hasaan

ఈ నేపథ్యంలో ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో ముచ్చటించిన శృతి ప్రేమ, పెళ్లి గురించి పలు ఆసక్తికరకామెంట్స్ చేసింది. గత కొంతకాలంగా శాంతను అనే ఆర్టిస్ట్ తో రిలేషన్ లో ఉన్న శృతి.. పెళ్లి గురించి తన ఒపీనియన్ చెప్పేసింది. మీ పెళ్లి ఎప్పుడూ అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పింది. పెళ్లి అంటే బోర్ అని ఆన్సర్ ఇచ్చింది. అంతేకాదు.. శాంతానుతో ప్రేమ ఎప్పుడు.. ఎలా మొదలైంది అనే ఆసక్తికర విషయాలను కూడా రివీల్ చేసేసింది . శాంతాను ఆర్ట్స్ వర్క్ నచ్చి తనను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం ప్రారంభించానని.. కొద్ది రోజుల తరువాత మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చానని.. అలా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిపోయిందని చెప్పుకొచ్చింది.

వాస్తవానికి శృతి హాసన్ కి పెళ్లి మీద ఆసక్తి లేదా లేక శాంతానుతో పెళ్లి ఇంట్రెస్ట్ లేదా అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ప్రస్తుతం శృతిహాసన్ ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కే సలార్ మూవీలో నటిస్తోంది. ఈ మధ్య కాలంలో చెప్పుకోదగిన ఆఫర్స్ లేని శృతికి ఈ మూవీ హిట్ అవ్వడం చాలా కీలకం అనే చెప్పాలి. తెలుగులో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య తరువాత శృతిహాసన్ కి చెప్పుకోదగిన ఆఫర్లు కూడా రాలేదు. మరీ సలార్ సినిమా తరువాత అయినా శృతిహాసన్ టాలీవుడ్ లో బిజీ అవుతుందో లేదో వేచిచూడాలి మరీ.