ఎన్టీఆర్‌ అంటున్నాడు కాని చేయడం లేదు

jr-ntr-not-ready-for-doing-multi-starrer-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్‌ మరికొన్ని గంటల్లో ‘జైలవకుశ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా ప్రమోషన్‌ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా విశేషాలను ఒక మీడియా సంస్థతో షేర్‌ చేసుకుంటున్న సమయంలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ మల్టీస్టారర్‌ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం అని, కాని అందుకు తగ్గ కథ మరియు దర్శకుడు కావాలంటున్నాడు. తన ప్రతి సినిమా ప్రెస్‌ మీట్‌లో కూడా ఎన్టీఆర్‌ ఈ ప్రశ్నను ఎదుర్కోవడం, సమాధానంగా తప్పకుండా చేస్తాను కాని, మంచి కథ కావాలి అనడం జరుగుతుంది.

ఎన్టీఆర్‌ చెబుతున్నది ఒకటి, చేస్తున్నది మరోటి అంటున్నారు సినీ వర్గాల వారు. ఎన్టీఆర్‌ వద్దకు ఎవరు మల్టీస్టారర్‌ కథ అంటూ తీసుకు వెళ్లినా కూడా అసలు కథ వినేందుకు కూడా ఇష్టపడడు అని, గతంలో వంశీపైడిపల్లి చెప్పిన కథ తర్వాత ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ ఏ మల్టీస్టారర్‌ స్టోరీలను వినలేదని, ఎన్టీఆర్‌ వద్దకు పలు మల్టీస్టారర్‌ కథలు వెళ్లినా కూడా ఆసక్తి లేదు అంటూ వెనక్కు పంపించాడని చెబుతూ ఉంటారు. ‘ఊపిరి’ సినిమాలో నాగార్జునతో కలిసి నటించేందుకు మొదట ఓకే చెప్పిన ఎన్టీఆర్‌ ఆ తర్వాత ధైర్యం సరిపోక వెనక్కు తగ్గాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్‌ చేసి ఉంటే ఆ సినిమా స్థాయి మరింత పెరిగేది. కాని ఎన్టీఆర్‌కు మాత్రం మల్టీస్టారర్‌లు ఆసక్తి ఉండటం లేదు. ఎన్టీఆర్‌ పైకి మాత్రం మల్టీస్టారర్‌లు చేయాలని ఉంది అంటూ ప్రకటనలు చేస్తున్నాడు.