ఎన్టీఆర్‌ కూడా బాబీని తొక్కేస్తున్నాడు..!

jr ntr avoiding director Bobby in jai lava kusa movie promotions

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పలు చిత్రాలకు రచయితగా, సహాయ దర్శకుడిగా వర్క్‌ చేసిన బాబీ ‘పవర్‌’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి, రవితేజతో మాస్‌ పవర్‌ను చూపించాడు. ఆ సినిమాతో స్టార్‌ హీరోల దృష్టిని ఆకర్షించిన బాబీ ఏకంగా పవన్‌ కళ్యాణ్‌తో సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నాడు. ఆ సినిమా సమయంలో దర్శకుడు బాబీని పవన్‌ కళ్యాణ్‌ తొక్కేస్తున్నాడని, అన్ని కూడా తాను అనుకున్నట్లుగానే జరగాలంటూ బాబీ క్రియేటివిటీని పక్కకు పెట్టించాడు అనే ప్రచారం జరిగింది. అందుకే ఆ సినిమా ఫ్లాప్‌ అయినా కూడా ఎక్కువగా బాబీపై విమర్శు రాలేదు. కారణం అన్నింట్లో కూడా పవన్‌ వేలు పెట్టడం వల్లే ఫ్లాప్‌ అయ్యిందని టాక్‌ వచ్చింది.

ఇక బాబీ తాజాగా ఎన్టీఆర్‌తో జైలవకుశ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో కూడా బాబీ నిర్ణయాలను ఎన్టీఆర్‌ పట్టించుకోకుండా కొన్ని సొంత నిర్ణయాలు మరి కొన్ని వినాయక్‌ లేదా రాజమౌళి నిర్ణయాలను ఫాలో అయినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక విడుదల సమయంలో కూడా బాబీకి ప్రమోషన్‌ విషయంలో అన్యాయం జరుగుతుంది. బాబీని పెద్దగా పబ్లిసిటీ కార్యక్రమాలకు హాజరు కానివ్వడం లేదని అంటున్నారు. ఏ ఇంటర్వ్యూలో చూసినా కూడా ఎన్టీఆర్‌ మరియు హీరోయిన్స్‌ కళ్యాణ్‌ రామ్‌లు మాత్రమే కనిపిస్తున్నారు. ఒక్కటి అర ఇంటర్వ్యూల్లో మాత్రమే బాబీ కనిపిస్తున్నాడని అంటున్నారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఎన్టీఆర్‌ అభిమానులు కొట్టి పారేస్తున్నారు.