బాబీకి నాని హ్యాండ్‌ ఇచ్చినట్లేనా?

nani-is-asking-for-more-time-to-act-in-bobbys-direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]          

పవన్‌ కళ్యాణ్‌తో సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ చిత్రాన్ని చేసి అట్టర్‌ ఫ్లాప్‌ అయిన దర్శకుడు బాబీ తాజాగా ‘జైలవకుశ’ చిత్రాన్ని చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్‌ను మూడు విభిన్న పాత్రల్లో చూపించి నందమూరి అభిమానుల ప్రశంసలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను దక్కించుకున్న ‘జై లవకుశ’ చిత్రంతో బాబీ స్థాయి పెరిగి పోయింది. ఈ దర్శకుడితో సినిమాలు చేసేందుకు యువ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ దర్శకుడు మాత్రం నానితో సినిమా చేసేందుకు ఆసక్తిని కనర్చాడు. ఒక స్క్రిప్ట్‌ను నాని కోసం సిద్దం చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

బాబీకి నాని హ్యాండ్‌ ఇచ్చినట్లేనా? - Telugu Bullet

ఇటీవలే నానికి కథ చెప్పడం జరిగిందని, నానికి కథ నచ్చిందనే వార్తలు వచ్చాయి. వచ్చే సంవత్సరం ఆరంభంలో బాబీ, నానిల కాంబో మూవీ సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాబీ దర్శకత్వంలో నటించేందుకు మరింత సమయం కావాలని నాని కోరాడట. వచ్చే సంవత్సరం వరకు బిజీగా ఉన్న కారణంగా బాబీ దర్శకత్వంలో ఇప్పట్లో సినిమా చేయలేను అంటూ నాని తేల్చి చెప్పాడు. దాంతో బాబీ ఏం చేయాలో నిర్ణయించుకోలేక పోతున్నాడట. మరో కథను సిద్దం చేసేందుకు బాబీ సిద్దం అవుతున్నాడు. స్టార్‌ హీరోలు అంతా కూడా ఇతరత్ర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. రెండు మూడు సినిమాలు కమిట్‌ అవ్వడంతో బాబీకి ఏ ఒక్క స్టార్‌ హీరో కూడా డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. దాంతో బాబీ తర్వాత సినిమాకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. సక్సెస్‌ వచ్చినా దాన్ని వినియోగించుకోలేక పోవడం బాబీ దురదృష్టం అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.