ఎన్టీఆర్‌కు గుడి.. ఎక్కడో తెలిస్తే షాక్‌

karnataka-fans-are-getting-ready-to-build-a-temple-for-junior-ntr

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నాడు. గత చిత్రం ‘జనతాగ్యారేజ్‌’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌ తాజాగా ‘జైలవకుశ’ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ను అందుకున్నాడు. టాలీవుడ్‌ టాప్‌ చిత్రాల జాబితాలో ఆ చిత్రం చేరింది అంటే ఎన్టీఆర్‌ ఏ స్థాయిలో తన స్టామినాను చూపించాడో చెప్పుకోవచ్చు. భారీ అంచనాలున్న ఈ సినిమా విజయంతో ఎన్టీఆర్‌ క్రేజ్‌ మరింతగా పెరిగింది. ఎన్టీఆర్‌ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు మరియు కర్ణాటకలో కూడా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నాడు. మొదటి రెండు వారాల్లో ఎన్టీఆర్‌ కొత్త సినిమాలు అక్కడ భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఓవర్సీస్‌లో కూడా ఎన్టీఆర్‌కు మంచి ఆధరణ దక్కుతుంది.

కర్ణాటకలో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్‌ ఉంది. ముఖ్యంగా కొన్ని ఏరియాల్లో కన్నడ సినిమాల కంటే కూడా అధికంగా తెలుగు సినిమాలు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక తాజాగా విడుదలైన ‘జైలవకుశ’ చిత్రాన్ని కూడా కన్నడ ప్రేక్షకులు అక్కడ భారీ విజయాన్ని చేశారు. రికార్డు స్థాయి కలెక్షన్స్‌ను ఎన్టీఆర్‌కు అక్కడ అభిమానులు ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్‌ స్టామినా ఏంటో ఆ కలెక్షన్స్‌తో తేలిపోయింది. మరోసారి కన్నడంలో ఎన్టీఆర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏంటో ఈ సంఘటనతో నిరూపితం కాబోతుంది.

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కర్ణాటకలోని ఒక ఏరియాలో గుడి కట్టేందుకు సిద్దం అవుతున్నారు. ఎన్టీఆర్‌ అంటే అభిమానంతో దాదాపు 15 మంది కలిసి గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. అక్కడ స్థానికంగా ఉన్న వందలాది మంది కూడా ఓకే చెప్పారు. సంతకాల సేకరణ కూడా జరిపి ఎన్టీఆర్‌కు గుడి కట్టాలన్న నిర్ణయించారు. ఎక్కువ శాతం మంది ఎన్టీఆర్‌ గుడికి మద్దతు పలకడంతో త్వరలోనే అక్కడ ఎన్టీఆర్‌ గుడిని నిర్మించేందుకు ఫ్యాన్స్‌ సిద్దం అవుతున్నారు. ఎన్టీఆర్‌కు గుడి కడితే దాని ప్రారంభోత్సవంకు ఎన్టీఆర్‌ వెళ్తాడేమో చూడాలి. గతంలో తమిళనాడులో హీరోలకు హీరోయిన్స్‌కు గుడి కట్టడం చూశాం. కాని మొదటి సారి మన యంగ్‌ టైగర్‌కు గుడి కట్టబోతుండటం సంతోషంగా ఉందని నందమూరి ఫ్యాన్స్‌ అంటున్నారు.