‘హౌరాబ్రిడ్జ్‌’తో ఛాందిని స్థాయి పెరగడం ఖాయం…

Chandini Chowdary Rahul Ravindran romance in Howrah Bridge movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
యూట్యూబ్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుని ఇటీవలే వెండి తెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఛాందిని చౌదరి తాజాగా ‘హౌరాబ్రిడ్జ్‌’ చిత్రంలో రాహుల్‌ రవీంద్రన్‌కు జోడీగా నటించింది. వీరిద్దరి కాంబోలో వచ్చే రొమాంటిక్‌ సీన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. సినిమా ఖచ్చితంగా మాస్‌ ఆడియన్స్‌తో పాటు క్లాస్‌ ఆడియన్స్‌ మరియు యూత్‌ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. టీజర్‌ విడుదల తర్వాత సినిమా గురించి మాట్లాడుకుంటున్న వారు ఎక్కువ అయ్యారు.

ఇక ఈ సినిమాలో చాందిని లుక్స్‌కు యూత్‌ ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌లో ఛాందిని లుక్‌ ఉందని, తప్పకుండా ఈ సినిమా తర్వాత ఛాందినికి మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిర్రలో ఛాందిని గ్లామర్‌గా కనిపించడంతో పాటు మంచి నటనను కూడా ఇచ్చిందని సినిమాలో ఆమె పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని, రాహుల్‌ రవీంద్రన్‌కు మంచి జోడీగా నిలిచిందని చిత్ర యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చిత్ర నిర్మాత పేర్కొన్నారు. సినిమాను కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈ సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా అన్ని ఏరియాల్లో ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.