‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ పోస్టర్ రిలీజ్ : రష్మిక బర్త్డే స్పెషల్ ..!

'The Girl Friend' Movie Poster Release: Rashmika Birthday Special ..!
'The Girl Friend' Movie Poster Release: Rashmika Birthday Special ..!

స్టార్ నటి రష్మిక మందన్న ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమా తో పాటు మరికొన్ని మూవీ లని చేస్తున్నారు. అందులో ఒకటి యువ దర్శకుడు చిలసౌ మూవీ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తోన్న ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం . ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. విషయం ఏమిటంటే, నేడు రష్మిక బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని అందరూ భావించారు. అయితే టీజర్ పోస్ట్ పోన్ అయింది. ఇది ఆమె ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

'The Girl Friend' Movie Poster Release: Rashmika Birthday Special ..!
‘The Girl Friend’ Movie Poster Release: Rashmika Birthday Special ..!

అయితే టీజర్ లాంచ్ కోసం ఒక స్పెషల్ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించనుండగా, ఇందులో భాగంగా తమ అభిమాన నటి రష్మిక కలుసుకునే అవకాశాన్ని పలువురు ఆమె ఫ్యాన్స్ కు కల్పించనున్నారు మేకర్స్. ఇది ఒకరకంగా రష్మిక ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఇక నేడు ఉదయం 10 గం. లకు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మోగిలినేని ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై ధీరజ్ మొగిలినేని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.