Sports: IPL 2024లో చెన్నైతో తలపడనున్న హైదరాబాద్.. ధోని దూరం కానున్నాడా?

Sports: Hyderabad to face Chennai in IPL 2024.. Will Dhoni stay away?
Sports: Hyderabad to face Chennai in IPL 2024.. Will Dhoni stay away?

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా మరో కీలక పోరు జరగనుంది. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ మరియు హైదరాబాద్ జట్ల మధ్య 18 వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి.

మొదట టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పటివరకు CSK జట్టుపై హైదరాబాద్ జట్టుకు మంచి ఫలితం లేదు. ప్రతి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తూనే ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ ఆటగాళ్లు ఎలా ఆడతారు చూడాలి.