అయ్యో బాబీ… తర్వాత సినిమా అతడితోనా?

Director Bobby Next Movie With Vijay Devarakonda

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మాస్‌ మహారాజ్‌ రవితేజతో ‘పవర్‌’ చిత్రాన్ని చేసి మొదటి సినిమాతోనే సూపర్‌ హిట్‌ను దక్కించుకున్నాడు బాబీ. ‘పవర్‌’ చూపించడంతో పవన్‌ దృష్టిలో బాబీ పడ్డాడు. ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ చిత్రాన్ని పవన్‌తో చేసే అవకాశం బాబీకి దక్కింది. కారణం ఏదైనా కాని ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. అయినా కూడా బాబీపై నమ్మకంతో ఎన్టీఆర్‌ ‘జైలవకుశ’ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను అప్పగించాడు. వచ్చిన అవకాశంను బాబీ సద్వినియోగం చేసుకున్నాడు. ఎన్టీఆర్‌తో మూడు పాత్రలు చేసింది భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను ఎన్టీఆర్‌కు అందించాడు. ఆ సినిమాతో బాబీ స్థాయి మరింతగా పెరిగింది. దాంతో ఈయనతో సినిమాలు చేసేందుకు స్టార్‌ హీరోలతో పాటు యువ హీరోలు క్యూ కడుతున్నారు. బాబీ తర్వాత సినిమా ఒక స్టార్‌ హీరోలు ఉంటుందని అంతా భావిస్తే ఒక కొత్త హీరోతో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

‘పెళ్లిచూపులు’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యి, ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విజయ్‌ దేవరకొండతో బాబీ తర్వాత సినిమా ఉండబోతున్నట్లుగా తాజాగా అందుతున్న సమాచారం ద్వారా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ‘జైలవకుశ’ చిత్రం హడావుడిలో ఉన్న బాబీ తాజాగా ఒక యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కథను సిద్దం చేశాడట. ఆ కథకు విజయ్‌ దేవరకొండ అయితే బాగుంటుందనే అభిప్రాయానికి బాబీ వచ్చాడు. బాబీ చెప్పిన స్టోరీ లైన్‌ విజయ్‌కు నచ్చడం వచ్చే సంవత్సరంలో డేట్లు కేటాయించడం కూడా జరిగి పోయింది. వచ్చే సంవత్సరం చివర్లో సినిమాను విడుదల అయ్యేలా ప్లాప్‌ చేస్తున్నారు.

‘జైలవకుశ’ చిత్రంతో వంద కోట్ల చిత్రాన్ని తెలుగు పరిశ్రమకు అందించిన బాబీతో ఏ స్టార్‌ హీరో అయినా నటించేందుకు సిద్దం అంటాడు. ఇలాంటి సమయంలో ఒక చిన్న హీరోతో అది కూడా ఒకటి రెండు సినిమాలు సక్సెస్‌ సాధించిన హీరోను ఎంచుకోవడంను తప్పుబడుతున్నారు. బాబీ తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అంటూ కొందరు సోషల్‌ మీడియాలో తమ వాయిస్‌ వినిపిస్తున్నారు. బాబీ ఇప్పటికైనా తన నిర్ణయం మార్చుకోవాలని కొందరు కోరుతున్నారు. కొందరు మాత్రం చిన్న హీరోతో సినిమా చేసి పెద్ద సక్సెస్‌ను కొట్టినప్పుడు అసలైన కిక్‌ అని, ఆ కిక్‌ను బాబీ పొందాలనుకుంటున్నాడేమో అంటూ కొందరు అంటున్నారు.