ఎన్టీఆర్ మొదటి మూవీ పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఎన్టీఆర్ మొదటి మూవీ పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ మూవీస్ కొన్నాళ్లుగా కాసులు కురిపిస్తున్నాయి. టెంపర్ చిత్రం నుండి ఆయన వరుస విజయాలు అందుకుంటున్నారు. ఐతే హీరోగా ఎన్టీఆర్ మొదటి పారితోషికం ఎంత అనేది ఓ సందర్భంలో ఎన్టీఆర్ తెలియజేశారు. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన ఎన్టీఆర్, 2001లో వచ్చిన నిన్ను చూడాలని అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

ఉషా కిరణ్ మూవీస్ పతాకంలో తెరకెక్కిన ఈ మూవీలో నటించినందుకు ఎన్టీఆర్ కేవలం 4 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అప్పటికి టీనేజ్ కూడా దాటని ఎన్టీఆర్ కి ఆ నాలుగు లక్షలు ఏమి చేయాలో తెలియక తికమక పడ్డారట. ఇక హీరోగా తన మొదటి సంపాదన తల్లికి బహుమతిగా ఇచ్చాడట. ఆ తరువాత రెండేళ్లలోనే ఎన్టీఆర్ ఆది, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్స్ అందుకొని టాప్ స్టార్ గా భారీ రెమ్యూనరేషన్ అందుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాకు 30కోట్లకు పైనే తీసుకుంటున్నారని సమాచారం.