సిక్కోలు షాక్.. 3గంటల్లో 2 రోడ్డు ప్రమాదాలు.. ఆపై ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్‌ లో ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కసారిగా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో భారీగా వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. లాక్‌డౌన్‌తో ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న రోడ్లు ఇప్పుడు రక్తమోడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ సిక్కోలులో కేవలం మూడు గంటల సమయంలో రెండు చోట్ల  ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మరణించగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అయితే ఒకేరోజు వెంట వెంటనే ఈ రెండు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేగుతోంది. గరిడి కండి-చినబాదాము గ్రామాల మధ్య ఆటో-లారీ ఢికోనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే.. ఆటో డ్రైవర్‌తోపాటు అందులో ప్రయాణిస్తున్న చేపల వ్యాపారి ప్రాణాలు కోల్పోయారు. అలాగే..  పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్‌ వద్ద ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో చెన్నైనుంచి పశ్చిమబెంగాల్‌కు వలకూలీలను తీసుకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా టోల్‌గేటు వద్ద ఆగిఉన్న లారీని వెనుక నుంచి బస్సు బలంగా ఢికొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ మణిమాల మృత్యువాత పడ్డారు. క్లీనర్‌ స్వామి అయ్యర్‌ తీవ్రంగా గాయ పడ్డారు. అయితే డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటమే ఈ రోడ్డు ప్రమాదానికి గల కారణమని స్థానికులు వెల్లడిస్తున్నారు.