నా అభిమానులు నాకిచ్చే విలువైన బహుమతి అదే …jr N .T .R

నా అభిమానులు నాకిచ్చే విలువైన బహుమతి అదే ...jr N .T .R

ప్ర‌తీ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు వ‌స్తుందంటే చాలు అభిమానులు పండ‌గ చేసుకుంటారు. అందుకే మే 20న నంద‌మూరి ఫ్యాన్స్ కు చాలా ప్రత్యేకం. పైగా ఎన్టీఆర్ కూడా ఆ రోజు వీలైనంత వ‌ర‌కు ఫ్యాన్స్ మ‌ధ్య‌లోనే ఉండ‌టానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు. అయితే ఈ సారి మాత్రం అలాంటి సంబ‌రాలు లేవు.

అయితే అభిమానులు మే 20న తార‌క్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొమురం భీమ్ పాత్ర‌లో ఆయన వీడియో ప్రోమో వస్తుందని ఎంతో ఆశగా ఉన్నారు కానీ ఆ రోజు ఎన్టీఆర్‌కు సంబంధించిన ఎలాంటి వీడియోను విడుద‌ల చేయ‌డం లేద‌ని అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల గురించి వివరిస్తూ తన అభిమానుల ముందు ఓ విన్నపం ఉంచారు తారక్.

కరోనా నేపద్యంలో ప్రస్తుత విపత్కర పరిస్థితుల రీత్యా ఈ సారి నా పుట్టినరోజు వేడుకలకి మీరంతా దూరంగా ఉండాలని తారక్ తన ఫ్యాన్స్ కు ఒక లెటర్ రిలీజ్ చేస్తూ.. ‘ప్రతి ఏటా నా పుట్టిన రోజున మీరు చూపించే ప్రేమ చేసే సేవ కార్యక్రమాలు ఓ ఆశీర్వచనంగా భావిస్తాను. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటిపట్టునే ఉంటూ అధికారుల సూచనలు పాటిస్తూ భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని అదే మీరిచ్చే విలువైన బహుమతి అంటూ తారక్ తన విన్నపాన్ని అభిమానుల ముందుంచారు.