శ్రీదేవితో 25వది చేయాలనుందట

k Raghavendra Rao makeing a film with sridevi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 K Raghavendra Rao Makeing A Film With Sridevi

శ్రీదేవి తాజాగా నటించిన ‘మామ్‌’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చింది. సౌత్‌లో తనకున్న క్రేజ్‌ను ఉపయోగించుకుని భారీ వసూళ్లను రాబట్టాలని ఆమె ప్రయత్నిస్తుంది. బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘మామ్‌’ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్‌ చేయబోతున్నారు. ఆ సినిమా ప్రమోషన్‌ కోసం తనకు సన్నిహితులు అయిన రాఘవేంద్ర రావు, టీఎస్సార్‌, సురేష్‌బాబులతో మీడియా సమావేశం నిర్వహించింది. ఆ మీడియా సమావేశంలో రాఘవేంద్ర రావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.

గత కొంత కాలంగా రాఘవేంద్ర రావు ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీదేవితో ఒక సినిమా చేయాలనుంది అంటూ రాఘవేంద్ర రావు చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు శ్రీదేవి హీరోయిన్‌గా 24 చిత్రాలను తెరకెక్కించాను. మరో సినిమాను ఆమె హీరోయిన్‌గా పెట్టి తెరకెక్కించి 25 చిత్రాలు చేసిన దర్శకుడిగా నిలిచిపోవాలనుందని చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు అనేది అందరి మాట. శ్రీదేవితో రాఘవేంద్ర రావు సినిమా సాధ్యం అని కొందరు అంటున్నారు. ఒక స్టార్‌ హీరో వారసుడితో రాఘవేంద్ర రావు సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు. ఆ సినిమాలో శ్రీదేవిని ముఖ్య పాత్రలో పెట్టడంతో 25వ చిత్రం చేసినట్లవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సినిమా వారు మీడియా ముందుకు వస్తే నోటికి వచ్చింది మాట్లాడేస్తారు. అలాగే దర్శకేంద్రుడు కూడా ఆమెతో 25వ సినిమా చేయాలని ఉందని చెప్పి ఉంటాడు అని కొందరు అంటున్నారు.

మరిన్ని  వార్తలు

డీజే దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ

 ప్రభాస్‌ ఇబ్బంది పడ్డాడు

డీజే’ను బ్యాన్‌ చేయాలట!